Army Helicopter : జమ్మూలో కూలిన ఆర్మీ హెలికాఫ్టర్.. ఇద్దరు పైలట్లు మృతి

ఇండియన్‌ ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. ఇద్దరు పైలెట్లలతో ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్‌కు సమీపంలోని శివ్ గఢ్ ధార్‌ ప్రాంతంలో కుప్పకూలింది.

Army Helicopter : జమ్మూలో కూలిన ఆర్మీ హెలికాఫ్టర్.. ఇద్దరు పైలట్లు మృతి

Army Helicopter

Updated On : September 21, 2021 / 3:35 PM IST

Army Helicopter : ఇండియన్‌ ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. ఇద్దరు పైలెట్లలతో ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్‌కు సమీపంలోని శివ్ గఢ్ ధార్‌ ప్రాంతంలో కుప్పకూలింది. ఆకాశంలో దట్టమైన పొగమంచు వ్యాపించడంతో సిగ్నల్ సరిగా కనిపించక హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అధికారులు. ఇక ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదం విషయాన్నీ స్థానికుల ద్వారా తెలుసుకున్న జమ్మూ కాశ్మీర్ పోలీసులు.. ఓ రెస్క్యూ టీమ్ ను అక్కడికి పంపారు.

Read More : Indian Army : మానవత్వాన్ని చాటుకున్న భారత ఆర్మీ జవాన్లు

ఆ ప్రాంతం మొత్తం పొగమంచు కప్పి ఉండటంతో రెస్క్యూటీమ్ అతికష్టం మీద హెలికాఫ్టర్ ప్రమాదం జరిగిన చోటుకి వెళ్లినట్లు జమ్మూకాశ్మీర్ ఉధంపూర్ డీఐజీ సులేమాన్ చౌదరి తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మీ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. ఆర్మీ అధికారులు కూడా ఘటన స్థలికి చేరుకున్నట్లు ఆయన తెలిపారు.

Read More : Indian Army : ఆర్మీలో ఐదుగురు మహిళా అధికారులకు కల్నల్ హోదా