బీఎస్పీ నాయకుల మెడలో చెప్పుల దండ వేసి గాడిదపై ఊరేగించిన కార్యకర్తలు

  • Published By: venkaiahnaidu ,Published On : October 22, 2019 / 10:00 AM IST
బీఎస్పీ నాయకుల మెడలో చెప్పుల దండ వేసి గాడిదపై ఊరేగించిన కార్యకర్తలు

Updated On : October 22, 2019 / 10:00 AM IST

టిక్కెట్ కేటాయింపుల్లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపిస్తూ ఇద్దరు బీఎస్పీ నేతలకు మెడలో చెప్పుల దండ వేసి గాడిదపై ఊరేగించారు బీఎస్పీ కార్యకర్తలు. మంగళవారం(అక్టోబర్-22,2019)రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఈ ఘటన జరిగింది. బీఎస్పీ నేషనల్ కో ఆర్డినేటర్ రామ్ జీ గౌతమ్, మాజీ బీఎస్పీ రాష్ట్ర ఇన్ చార్జ్ సీతారామ్ ల ముఖాలకు నలుపురంగు పూసి,మెడలో చెప్పుల దండ వేసి బనీపార్క్ ఏరియాలోని పార్టీ ఆఫీస్ బయట గాడిదపై ఊరేగించారు.

బీఎస్పీ నేషనల్ కో ఆర్డినేటర్ రామ్ జీ గౌతమ్, మాజీ బీఎస్పీ రాష్ట్ర ఇన్ చార్జ్ సీతారామ్ లతో తాము విసుగు చెందామని, ఐదేళ్లుగా క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తులను వదిలిపెట్టి,డబ్బులు తీసుకుని రాత్రికి రాత్రి పార్టీలో చేరిన బీజేపీ,కాంగ్రెస్ నాయకులకు టిక్కెట్లు కేటాయించారని,టిక్కెట్ల కేటాయింపులో అవినీతికి పాల్పడ్డారని,బీఎస్పీ నాయకులను,కార్యకర్తలను వాడుకుని వదిలేశారని ఓ బీఎస్పీ కార్యకర్త తెలిపారు. తాము మూడుసార్లు నిరసన వ్యక్తం చేశామని,అయితే ఈ ఇద్దరు నాయకులు తమ ఆవేదనను పార్టీ చీఫ్ మాయావతి దృష్టికి తీసుకెళ్లలేదని,దీంతో తాము వారి మెడలో చెప్పుల దండ వేసి గాడిదపై ఊరేగించే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

అయితే ఈ ఘటనను మాయావతి ఖండించారు. సిగ్గుమాలిన చర్య అన్నారు. ఈ ఘటననకు సంబంధించి కాంగ్రెస్ పై ఆమె ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని బీఎస్పీ నేతలపై దాడులను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోందని ఆమె ఆరోపించారు.