Remdesivir: రెమెడెసివర్ బాటిల్ లో నీళ్లు పోసి రూ.28వేలకు అమ్ముతూ దొరికిపోయారు

సమస్యలతో.. బలహీనతలతో బాధపడే వారికి పరిష్కారం చూపిస్తామని వ్యాపారం చేయడం ఒక రకమైతే.. అసలు మందులేమీ లేకుండానే ..

Remdesivir: రెమెడెసివర్ బాటిల్ లో నీళ్లు పోసి రూ.28వేలకు అమ్ముతూ దొరికిపోయారు

Remedesivr

Updated On : September 22, 2021 / 4:17 PM IST

Remdesivir: సమస్యలతో.. బలహీనతలతో బాధపడే వారికి పరిష్కారం చూపిస్తామని వ్యాపారం చేయడం ఒక రకమైతే.. అసలు మందులేమీ లేకుండానే అద్భుతమైన మెడిసిన్ మీకు అందిస్తామంటూ బురిడీ కొట్టడం మరో రకం. ఇదిగో ఇలాగే నాగ్‌పూర్‌లోని సక్కరదర ప్రాంతంలోని వ్యక్తులు మోసం చేసి అమ్మకాలు జరుపుతూ దొరికిపోయారు.

అభిలాష్ పేట్కర్(28), అంకిత్ నందేశ్వర్(21) అనే ఇద్దరు ఎక్స్ రే టెక్నిషియన్లుగా పనిచేస్తున్నారు. వారి బంధువు ఒకరు మహారాష్ట్రలోని కొవిడ్-19 ఫెసిలిటీలో జాయిన్ అయ్యాడు. అతనికి అవసరం ఉందని తెలుసుకుని మొదటి బాటిల్ ను రూ.40, రెండోదానిని రూ.28వేలకు అమ్మారని ఇన్‌స్పెక్టర్ సత్యవాన్ మానె వెల్లడించారు.

ఆ బాటిల్స్ పట్ల అనుమానస్పదంగా ఉండటంతో బంధువు ఒకరు పోలీసులను సంప్రదించారు. వారిని ట్రాప్ చేసి ఇక్కడ ఉన్న ఫ్లై ఓవర్ కింద పట్టుకున్నాం. న్యూ సుబేదార్ లే అవుట్, మానెవాడాలో సోదాలు నిర్వహిస్తున్నామని సక్కరదర పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.

కొవిడ్ పేషెంట్లు కొందరు ఆరోగ్యం విషమంగా అనిపించడంతో రెమెడెసివర్ లాంటి మెడిసిన్ కోసం తంటాలు పడుతున్నారు. కేసుల్లో డిమాండ్ కూడా అలానే పెరిగి మందులు బ్లాక్ లో దొరికినా కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.