ఈమెకు ధైర్యమెక్కువ…కొండచిలువను కూడా

సాధారణంగా పాములను చూస్తే ఎవరైనా భయపడతారు. కాని ఒక మహిళా మాత్రం తెలివిగా 20 కిలోల బరువైన కొండచిలువను పట్టుకోంది. కేరళలోని ఎర్నాకులం ప్రాంతంలోఈ ఘటన చోటు చేసుకుంది. బీహార్ కి చెందిన విద్య నేవీ ఆఫీసర్ అయిన తన భర్తతో కలిసి ఎర్నాకులంలో ని పానంపల్లి నగర్ లో నివసిస్తుంది.
రెండు రోజుల క్రితం తన ఇంటి వెనుక ఉన్న పెరటిలోని చెట్టు కింద ఏదో కదులుతున్నట్లు. విద్య చూసింది. ఏంటా అని వెళ్లి చూస్తే, అక్కడ పెద్ద కొండచిలువ కనిపించింది. ఆమెకు పాములను పట్టుకునే అలవాటు ఉండటంతో ,చాలా తెలివిగా ఆ కొండచిలువ తలను పట్టుకోని నొక్కింది.
దానితో ఆ కొండచిలువ ఆమెను మింగలేకపోయింది. మరో ఇద్దరు దాని తోకను పట్టుకుని ఒక సంచిలో బంధించారు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్ లో ఫేర్ చేశాడు. వీడియో చూసిన నెటిజన్లు విద్య ధైర్యాన్ని ప్రశంసించారు. చాలా ధైర్యవంతురాలు అని మెచ్చుకుంటు కామెంట్స్ చేస్తున్నారు.
20 Kg python caught alive by wife of senior Navy officer.
Leave aside women, wonder how many men can show such guts.
I love my Navy. pic.twitter.com/6XNUBvE7MU— Harinder S Sikka (@sikka_harinder) December 11, 2019