ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో ‘అతి భయానక రాత్రి’ని అనుభవించాను.. కళ్లు తెరిచి చూసేసరికి..: 21 ఏళ్ల అమ్మాయి
21 Years Old Mumbai Woman: మత్తులో కిందపడిపోయిన ఆ యువతిపై ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ దారుణానికి ఒడిగట్టాడు. కళ్లు తెరిచి చూసేసరికి..

ఓ యువతి (21) తనకు ఎదురైన భయానక అనుభవాన్ని గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించి చెప్పింది. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ యువకుడు తనపై పాల్పడ్డ అఘాయిత్యం గురించి ఎవరికీ చెప్పకుండా వారం రోజులపాటు నరక వేధన అనుభవించిన ఆమె.. చివరకు ధైర్యం తెచ్చుకుని.. తనకు జరిగిన అన్యాయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రపంచానికి తెలియజేసింది.
ఏం జరిగింది?
ముంబైకి చెందిన ఆ యువతి ‘నాపై అత్యాచారానికి పాల్పడ్డవాడిని శిక్షించండి’ అంటూ ఓ కొత్త ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో పూర్తి వివరాలు చెప్పింది. ఇది నా కథ అంటూ ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ వ్యక్తితో బయటకు వెళ్లాలని అనుకున్నానని తెలిపింది.
తమకు కొంతమంది ఇతర యువకులతోనూ పరిచయాలు ఉన్నాయని చెప్పింది. ఒకరోజు రాత్రి వారందరితో కలిసి రెస్టారెంట్ కు వెళ్లి ఎంజాయ్ చేద్దామనుకున్నానని, అదే రోజు తనకు తన జీవితంలో ఎన్నడూ అనుభవించని అత్యంత బాధాకరమైన అనుభవం ఎదురైందని తెలిపింది.
హీతిక్ షా అనే యువకుడు, తాను పార్టీ చేసుకోవడానికి బయలుదేరామని తెలిపింది. అతడి స్నేహితులతో కలిసి తాము రెస్టారెంట్ కు బయలుదేరామని చెప్పింది. మద్యం తాగాక తాను కొద్దిగా మత్తులో ఉన్న సమయంలో ఇక తాగకూడదని అనుకున్నానని, కానీ ఇంకా తాగాలని తన హీతిక్ పట్టుబట్టాడని తెలిపింది.
కళ్లు తెరిచే సమయానికి..
ఆ తర్వాత ఏమి జరిగిందో తనకు గుర్తుకు రాలేదు. కొద్దిసేపటి తర్వాత తాను కళ్లు తెరిచే సమయానికి తనను అతడు అత్యాచారం చేస్తూ కనపడ్డాడని చెప్పింది. అతడిని నెట్టేయడానికి ప్రయత్నించానని, అయితే, తనను మూడు సార్లు చెంపపై కొట్టి, భయపెట్టి అత్యాచారం చేశాడని తెలిపింది.
అంతేగాక, హీతిశ్ స్నేహితులు అతడికి సపోర్ట్ చేశారని చెప్పింది. తాను ఈ విషయాన్ని ఇతరులకు చెప్పకుండా వెంటనే తనను అక్కడి నుంచి అతడి స్నేహితులు పంపించేశారని, హీతిశ్ కూడా అక్కడి నుంచి పారిపోయాడని తెలిపింది. తన బంధువుకి ఫోన్ చేసి తనను ఇంటికి తీసుకెళ్లాలని చెప్పానని, అతడు వచ్చి తీసుకెళ్లాడని వివరించింది.
ఆ రోజు రాత్రి ఎదురైన భయానక అనుభవాన్ని గురించి తన తల్లిదండ్రులకు తాను చెప్పలేదని తెలిపింది. చివరకి తన కుటుంబ సభ్యులకు చెప్పి, వారం రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించానని పేర్కొంది. నిందితుడు పరారీలో ఉన్నాడని, తప్పు చేశాడు కాబట్టే తప్పించుకు తిరుగుతున్నాడని చెప్పింది.
ఈ ఘటన జరిగి 12 రోజులు అవుతున్నా అతడిని పోలీసులు అరెస్టు చేయలేకపోయారని తెలిపింది. అంతేగాక, ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడని చెప్పింది. తనకు న్యాయం కావాలని చెప్పింది. ఇతరులతో బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు వహించాలని తోటి అమ్మాయిలకు ఆమె విజ్ఞప్తి చేసింది.
View this post on Instagram