School Students Test Covid Positive : ఒకే స్కూల్ లోని 29మంది విద్యార్థులకు కరోనా

స్ట్ బెంగాల్ రాష్ట్రం నదియా జిల్లాలోని కళ్యాణిలోని జవహార్ నవోదయ విద్యాలయలోని 29 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని స్థానిక అధికారి ఒకరు కన్ఫర్మ్ చేశారు.

School Students Test Covid Positive : ఒకే స్కూల్ లోని 29మంది విద్యార్థులకు కరోనా

Students

Updated On : December 22, 2021 / 6:05 PM IST

School Students Test Covid Positive :  వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నదియా జిల్లాలోని కళ్యాణిలోని జవహార్ నవోదయ విద్యాలయలోని 29 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని స్థానిక అధికారి ఒకరు కన్ఫర్మ్ చేశారు. 9,10వ తరగతి చదువుతున్న 29మంది విద్యార్ధులు కోవిడ్ బారిన పడ్డారని,కోవిడ్ బారినపడిన విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్లాల్సిందిగా వారి గార్డియన్స్ కు సమాచార మందిచనట్లు తెలిపారు.

పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు దగ్గు,జలుబు ఉన్న నేపథ్యంలో వారిని హోం క్వారంటైన్ లో ఉండాలని డాక్టర్లు సూచించారని తెలిపారు. స్కూల్ లోని ఇతర విద్యార్థులు,టీచర్లకు కోవిడ్ టెస్ట్ లు నిర్వహిస్తున్నట్లు కళ్యాణి సబ్ డివిజినల్ ఆఫీసర్(SDO) హిరాక్ మండల్ తెలిపారు.

ALSO READ Marriage Age: 21 ఏళ్ల పెళ్లి వయస్సు..బిల్లు పాస్ అయ్యేలోపు హడావిడిగా వందలాది పెళ్ళిళ్లు..