సీఎం సెక్యూరిటీ అరాచకం : బలవంతంగా బాలుడి చొక్కా విప్పించారు

పసివాడు చేసిన నేరం ఏంటి.. నల్ల జాకెట్ ధరించడమేనా.. ఇంత దానికే మూడేళ్ల పసివాడి చేత నడిరోడ్డుపై చొక్కా విప్పించారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Published By: sreehari ,Published On : January 30, 2019 / 10:47 AM IST
సీఎం సెక్యూరిటీ అరాచకం : బలవంతంగా బాలుడి చొక్కా విప్పించారు

Updated On : January 30, 2019 / 10:47 AM IST

పసివాడు చేసిన నేరం ఏంటి.. నల్ల జాకెట్ ధరించడమేనా.. ఇంత దానికే మూడేళ్ల పసివాడి చేత నడిరోడ్డుపై చొక్కా విప్పించారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పసివాడు చేసిన నేరం ఏంటి.. నల్ల జాకెట్ ధరించడమేనా.. ఇంత దానికే మూడేళ్ల పసివాడి చేత నడిరోడ్డుపై చొక్కా విప్పించారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎ ర్యాలీకి పిల్లాడికి సంబంధం ఏంటి.. పసిబాలుడిని చూడకుండా నడిరోడ్డుపై జాకెట్ విప్పించారంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. అసలేం.. జరిగిందంటే.. అస్సాంలోని బిశ్వాంత్ జిల్లాలో సీఎం శర్భానంద సోనోవాల్ బహిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తల్లితో పాటు వచ్చిన మూడేళ్ల పిల్లోడిని అక్కడి భద్రతా దళాలు అడ్డుకున్నాయి. అంతటితో ఆగకుండా పిల్లాడు ధరించిన నల్ల జాకెట్ ను బలవంతంగా విప్పించారు.

అస్సాంలో మరోవైపు పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. బిల్లును వ్యతిరేకించిన మంత్రులంతా నల్ల జెండాలతో నిరసనలు తెలిపారు. దీంతో అస్సాంలో యాంటీ బ్లాక్ ప్రొటోకాల్ విధించారు. అదే సమయంలో అస్సాంలోని బిశ్వంత్ జిల్లాలో మంగళవారం (జనవరి 29)నాడు రాష్ట్ర సీఎం శర్భానంద సోనోవాల్ భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం ర్యాలీకి వందలాది మంది జనం తరలివచ్చారు. 

ఈ ర్యాలీలో ఓ మహిళ తన పిల్లాడితో కలిసి వచ్చింది. అక్కడి భద్రతా సిబ్బంది ఆమెను సీఎం సభకు వెళ్లకుండా అడ్డుకున్నారు. నల్ల జాకెట్ ధరించడం ప్రొటోకాల్ కు విరుద్ధమంటూ నడిరోడ్డుపైనే పిల్లాడి నల్ల జాకెట్ విప్పించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, అస్సాం స్థానిక టీవీ ఛానళ్లలో, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదాస్పదమైంది. దీనిపై సీఎం సోనోవాల్ స్పందించి వెంటనేపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.