నిసర్గ ఎఫెక్ట్ : 31 విమానాలు రద్దు..స్పెషల్ ట్రైన్స్ రీ షెడ్యూల్

  • Published By: nagamani ,Published On : June 3, 2020 / 09:17 AM IST
నిసర్గ ఎఫెక్ట్ : 31 విమానాలు రద్దు..స్పెషల్ ట్రైన్స్ రీ షెడ్యూల్

Updated On : June 3, 2020 / 9:17 AM IST

అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘నిసర్గ’ తుఫాన్ తీరం దాటడంతో ఇటు విమానయాన సంస్థలు, అటు రైల్వేశాఖ అప్రమత్తమయ్యాయి.  షెడ్యూల్ అయిన 50 విమానాల్లో నిసర్గ తుఫాను ప్రభావంతో 31 విమానాలను రద్దు చేసినట్లు ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్ అధికారులు ప్రకటించారు. మిగతా వాటిని ఎయిర్ ఏషియా ఇండియా, ఇండిగో, గో ఏయిర్, స్పేస్ జెట్ నడిపే బాధ్యతను చూసుకుంటాయని అధికారులు తెలిపారు.

అయితే జూన్ 3 నాటికి ముంబై చేరేవి, అక్కడి నుంచి బయల్దేరే 17 విమానాలను నిసర్గ తుఫాను ప్రభావం వల్ల రద్దు చేశామని  ఇండిగో ప్రకటించగా..మరో విమానయాన సంస్థ విస్టా… ముంబై, గోవా వెళ్లే విమానాలు, అక్కడి నుంచి వచ్చే విమానాలు నడపడం కాస్త కష్టమేనని తెలిపింది. స్పైస్ జెట్ కూడా ఇదే రకమైన ప్రకటనను విడుదల చేసింది. 

అలాగే నిసర్గ తుఫాను ప్రభావం రైళ్లపై కూడా పడింది. ముంబై చేరుకునే, అక్కడి నుంచి బయల్దేరే రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. ముంబైకి చేరుకునే ప్రత్యేక రైళ్లను రీషెడ్యూల్ చేశామని, వాటిని ఇతర మార్గాలకు మళ్లించామని రైల్వేశాఖ తెలిపింది.   

మార్పుల అనతరం..ఎల్‌టిటి-గోరఖ్‌పూర్ స్పెషల్ ట్రైన్ ఉదయం 11.10 కు బదులుగా రాత్రి 8 గంటలకు, ఎల్‌టిటి-తిరువనంతపురం ట్రైన్  ఉదయం 11.40 కు బదులుగా 6 గంటలకు, ఎల్‌టిటి దర్భంగా స్పెషల్ ట్రైన్ రాత్రి 12.15 కి బదులుగా రాత్రి 8.30 గంటలకు బయలుదేరుతుందని తెలిపింది. 

అంతేకాకుండా, ఎల్‌టిటి-వారణాసి స్పెషల్ మధ్యాహ్నం 12.40 కు బదులుగా రాత్రి 9 గంటలకు బయలుదేరుతుందనీ.. సిఎస్‌ఎమ్‌టి-భువనేశ్వర్ స్పెషల్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సిఎస్‌ఎంటి) నుండి రాత్రి 3.05 కి బదులుగా రాత్రి 8 గంటలకు బయలుదేరుతుందని రైల్వే శాఖ తెలిపింది. 

Read: అలీబాగ్ వద్ద తీరాన్ని తాకిన నిసర్గ తుపాన్