Omicron In India : భారత్ లో 32కు చేరిన ఒమిక్రాన్ కేసులు..ఒక్కరోజే 9 గుర్తింపు

భారత్ లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కు చేరింది.

Omicron In India : భారత్ లో 32కు చేరిన ఒమిక్రాన్ కేసులు..ఒక్కరోజే 9 గుర్తింపు

Omicron (2)

Updated On : December 10, 2021 / 8:36 PM IST

32 Omicron cases in India : భారత్ లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కు చేరింది. ఇప్పటివరకు ఐదు రాష్ట్రాల్లో 32 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇవాళ ఏడు కొత్త ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి.

వీటిలో ముంబైలో 3, పింప్రిలో 4 కొత్త వేరియంట్ కేసులు గుర్తించారు. దీంతో మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు 17కు చేరాయి. రాజస్థాన్ లో 9, గుజరాత్ లో 3, కర్నాటకలో 2, ఢిల్లీలో ఒకటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.

Krishna River : కృష్ణానదిలో స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు గల్లంతు

మరోవైపు తెలంగాణలో ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది. విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ ఇద్దరి శాంపిల్స్ ను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. వాటి ఫలితాలొస్తే కానీ ఒమిక్రాన్ వేరియంటా? కాదా అన్న విషయం తేలనుంది.