Maharashtra : కరోనా కల్లోలం, 338 మంది రెసిడెంట్ వైద్యులకు పాజిటివ్

మహారాష్ట్ర వ్యాప్తంగా 338 మంది రెసిడెంట్ వైద్యులు కరోనా బారిన పడ్డారు. ముంబైలోనే 230 మంది రెసిడెంట్ వైద్యులకు కరోనా పాజిటివ్ వచ్చింది...

Maharashtra : కరోనా కల్లోలం, 338 మంది రెసిడెంట్ వైద్యులకు పాజిటివ్

Corona

Updated On : January 7, 2022 / 9:23 AM IST

338 Resident Doctors Corona : కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎంతో మంది ఈ దిక్కుమాలిన వైరస్ బారిన పడి చనిపోతున్నారు. దీనికి తోడు కొత్త వేరయింట్ ఒమిక్రాన్ గడగడలాడిస్తోంది. తగ్గుముఖం పడుతుందని అనుకుంటున్న క్రమంలో…కరోనా వైరస్ పంజా విసురుతోంది. భారతదేశంలో పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోనళలకు గురవుతున్నారు. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్రపై కరోనా పంజా విసురుతోంది. ఆ రాష్ట్రంలోని ముంబైలో ప్రతాపం చూపుతోంది. శుక్రవారం ఒక్కరోజే మహారాష్ట్రలో 36 వేల 265 కేసులు నమోదు కాగా.. ఇందులో ముంబైలోనే 20 వేలకు పైగా ఉన్నాయి. తాజాగా…వైద్యులు కూడా కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర వ్యాప్తంగా 338 మంది రెసిడెంట్ వైద్యులు కరోనా బారిన పడ్డారు. ముంబైలోనే 230 మంది రెసిడెంట్ వైద్యులకు కరోనా పాజిటివ్ వచ్చింది.

Read More : Kerala : వింత వింత సైజుల్లో కోడిగుడ్లు పెడుతున్న కోడిపెట్ట..తెల్లసొన మాత్రమే ఉంటుంది

దేశంలోనూ కరోనా కోరలు చాస్తోంది. మళ్లీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలో తాజాగా లక్షకు చేరువలో కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. తొమ్మిది రోజుల వ్యవధిలో కేసులు 10 రెట్లు పెరిగి మహమ్మారి పంజా విసిరింది. డిసెంబర్ 28న దాదాపు 9వేలకు పైగా కేసులు నమోదుకాగా..గురువారం 90వేల పైచిలుకు కేసులు వచ్చాయి. ముందురోజు కంటే 56 శాతం అధికంగా కేసులు బయటపడ్డాయి.

Read More : Dog saves Owner: కిడ్నాప్ నుంచి యజమానిని రక్షించిన శునకం

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లో మూడోవేవ్‌కు ఆజ్యం పోస్తోంది. ప్రస్తుతం ఆ వేరియంట్‌లో గుర్తించిన కేసులు 2వేల 630కి చేరాయి. ప్రస్తుతం దేశంలో 3లక్షలకు చేరువలో యాక్టివ్ కేసులున్నాయి. వీటిలో 66.97 శాతం మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ, తమిళనాడు, కేరళలోనే ఉన్నాయి. కరోనా మరోసారి విజృంభిస్తుండంతో ప్రధాని మోదీ 2022, జనవరి 07వ తేదీ శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా సమావేశం కానున్నారు. కోవిడ్‌ మార్గదర్శకాలు, ఒమిక్రాన్‌ వ్యాప్తిపై చర్చించనున్నారు.