మనాలిలో 4కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్

హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి-సొలాంగ్-నల్లారూట్‌లో 4కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సోమవారం మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో వాహనాల కదలిక నెమ్మెదైంది. దీంతో పెద్ద మొత్తంలో ఖరీదు వెచ్చించి క్యాబ్ బుక్ చేసుకున్న వారంతా కాలినడకన ముందుకువెళ్లారు.
ఈ సందర్భంగా సుప్రియ అనే ఓ టూరిస్ట్ మాట్లాడుతూ.. ‘మేం ఇక్కడికి బెంగళూరు నుంచి వచ్చాం. పర్వతాలను చూసేందుకు వస్తే ట్రాఫిక్‌లో పూర్తిగా ఇరుక్కుపోయాం. ఓ క్యాబ్ తీసుకుని బయల్దేరిన మా ప్రయాణం కాలి నడకన పూర్తి అయింది. దాంతో పాటు హోటల్ రూంలు దొరకడం కూడా ఇబ్బంది అయిపోయింది’ అని తెలిపింది.
ఇంకో యువతి ఫ్రెండ్స్ తో కలిసి రూ.1200కు క్యాబ్ బుక్ చేసుకున్నామని.. ఈ ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనం నిలిచిపోయిందని వాపోయింది. వాహనంలో చేద్దామనుకున్న ప్రయాణం కాలినడకన పూర్తి అయిందని చెప్పుకొచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లో కులూ, మనాలి పేరు గాంచిన హిల్స్ స్టేషన్లు. మనాలిలో మంచు కురవడం ఈ సీజన్‌లో అప్పుడే మొదలైపోయింది.
గులాబా, సోలాంగ్, కోఠీ ప్రాంతాల మాదిరిగా మనాలి కనిపిస్తుంది. కిన్నౌర్ జిల్లాలోని కల్పా, లాహౌల్ లోని కీలాంగ్ ప్రాంతాల్లో ఇప్పటికే మంచు ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. వాతావరణ కార్యాలయం వివరాల ప్రకారం.. మనాలిలో రికార్డు స్థాయిలో 10.8డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. అదే ఢిల్లీలో సోమవారం మినిమం ఉష్ణోగ్రత 8.3డిగ్రీల సెల్పియస్ గా ఉంది. 1997డిసెంబర్ లో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదు అయినట్లు వాతావరణ కేంద్ర వెల్లడించింది.