కోల్‌కతాలో హైడ్రామా : సీబీఐ వర్సెస్ బెంగాల్ పోలీస్

  • Published By: venkaiahnaidu ,Published On : February 3, 2019 / 02:12 PM IST
కోల్‌కతాలో హైడ్రామా : సీబీఐ వర్సెస్ బెంగాల్ పోలీస్

Updated On : February 3, 2019 / 2:12 PM IST

కోల్‌కతాలో సీపీ ఇంటి దగ్గర హైడ్రామా కొనసాగుతోంది. శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ని ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు కోల్‌కతాలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే సీబీఐ బృందాన్ని లోనికి అనుమతించకుండా బయటే అడ్డుకున్నారు వెస్ట్ బెంగాల్ పోలీసులు. సీబీఐ అధికారులను బెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కి తరలించారు.

 

శారదా స్కామ్ కేసు విచారణలో భాగంగా రాజీవ్ కుమార్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్న సమయంలో సీబీఐ అధికారులను పోలీసులు అడ్డుకోవడం ఉత్కంఠ రేపుతోంది. సీఎం మమతా బెనర్జీ, డీజీపీ రాజీవ్ కుమార్ నివాసానికి చేరుకున్నారు. రాజీవ్ కుమార్‌కి మమత మద్దతు తెలిపారు. కేంద్రప్రభుత్వం కక్ష్య సాధింపులకు పాల్పడుతోందని సీఎం మమత ఆరోపించారు.