Blast : నాగ్‌పూర్ పేలుడు పదార్థాల తయారీ ఫ్యాక్టరీలో పేలుడు.. 5 మంది మృతి
బజార్‌గావ్ ప్రాంతంలోని సోలార్ ఇండస్ట్రీస్‌కు చెందిన కాస్ట్ బూస్టర్ యూనిట్‌లో ఉదయం 9 గంటలకు పేలుడు సంభవించిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

Nagpur Blast
Nagpur Blast : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. నాగ్‌పూర్ జిల్లాలోని పేలుడు పదార్థాల తయారీ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. బజార్‌గావ్ ప్రాంతంలోని సోలార్ ఇండస్ట్రీస్‌కు చెందిన కాస్ట్ బూస్టర్ యూనిట్‌లో ఉదయం 9 గంటలకు పేలుడు సంభవించిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు ఐదుగురు మరణించారని ఆయన చెప్పారు.