సరికొత్త ఫీచర్లతో 2021లోనే 7సీటింగ్ ఎస్‌యూవీలు

సరికొత్త ఫీచర్లతో 2021లోనే 7సీటింగ్ ఎస్‌యూవీలు

Updated On : March 6, 2021 / 11:14 AM IST

7-seat SUVs: పాపులారిటీ పెరుగుతున్న కొద్దీ ఇండియన్ మార్కెట్లో ఎస్‌యూవీలు మరింత ముస్తాబైపోతున్నాయి. ఈ ఏడాది ఎస్యూవీ సెగ్మెంట్ లో 7సీటర్ లు మార్కెట్లోకి తెచ్చేందుకు మ్యాన్యుఫ్యాక్చరర్లు మోస్ట్ ఇంటరస్టింగ్ గా ఉన్నారు. ఇప్పటి వరకూ ఉన్న Hyundai Tucson, Mahindra XUV500, Safari, Hector Plusలు మార్కెట్లో పాతుకుపోయాయి. మరికొద్ది నెలల్లో ఇండియన్ మార్కెట్లోకి రానున్న ఎస్‌యూవీలు.

Hyundai Alcazar (హ్యూండాయ్ అల్కాజర్):
హ్యూండాయ్ లాంచ్ చేసిన కొత్త మోడల్.. అల్కాజర్. పేరు బయటకు వచ్చింది కానీ మోడల్ డిజైన్ బయటకు రాలేదు. ప్రస్తుతం ఇండియన్ రోడ్ల మీద టెస్టింగ్ లో ఉంది. ఇది ఏడు లేదా ఆరు సీటింగ్ ఆప్షన్ ఇచ్చేలా కనిపిస్తుంది. క్రెటాకు దగ్గరిగా ఉంది కానీ పూర్తిగా వేరు. ఇందులో మూడు ఇంజిన్ వేరియంట్లు ఉండనున్నాయి. 1.5లీటర్ పెట్రోల్, 1.5లీటర్ డీజిల్, 1.4లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్.

Mahindra XUV500 (మహీంద్రా ఎక్స్‌యూవీ500):
ఈ మోడల్ డిజైన్ కు ఎంత డిమాండ్ ఉందంటే పేరు తెలియడంతో పలు లొకేషన్లలో టెస్టింగ్ లో ఉన్న దానిపై వేరే వెహికల్స్ మోడల్ ఫొటోలను ఇదే మహీంద్రా ఎక్స్‌యూవీ 500 అని పోస్టు చేస్తున్నారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. తొలి పనోరమిక్ సన్‌రూఫ్ మోడల్ ఇదే.

Mahindra Scorpio (మహీంద్రా స్కార్పియో):
మహీంద్రా నుంచి వచ్చిన కొత్త మోడల్.. టాటా హ్యారియర్ ను పోలి కాస్త సైజులో మార్పులతో రెడీ అవుతుంది. దీని ఇంజిన్ ఆప్షన్లు థార్ తో పాటు సమానంగా, ఫ్యూయెల్ టైప్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో నడుస్తుంది.

Skoda Kodiaq (స్కోడా కొడియాక్):
మరికొద్ది రోజుల్లో ఇండియన్ మార్కెట్లోకి రానున్న స్కోడా మోడల్ కొడియాక్. ఇది కేవలం 2.0లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో 7స్పీడ్ డీఎస్జీ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడా నడుస్తుంది. దీని ధర రూ.32లక్షలకు పైగానే ఉంటుందట. ఈ ఏడాది తొలి లేదా రెండో క్వార్టర్ లో మోడల్ లాంచ్ కానుంది.

Jeep Compass 7-seater (జీప్ కంపాస్ 7 సీటర్):
ఇండియన్ మార్కెట్ దశ దిశలా జీప్ మోడల్ పాకిపోయింది. అయితే కంపాస్ మోడల్ మాత్రమే ఇండియన్ మార్కెట్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో సెవన్ సీటర్ వర్షన్ కూడా రిలీజ్ అవుతుంది. జీప్ కు కూడా అదే ఇంజిన్, అదే ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ తో అందుబాటులోకి రానుంది.