మనసు పరవశించే : ఈలతో 50మంది ‘మైల్ సుర్ మేరా తుమ్హారా’ పాట

  • Published By: veegamteam ,Published On : January 29, 2020 / 08:44 AM IST
మనసు పరవశించే : ఈలతో 50మంది ‘మైల్ సుర్ మేరా తుమ్హారా’ పాట

Updated On : January 29, 2020 / 8:44 AM IST

‘మైల్ సుర్ మేరా తుమ్హారా’పాట వింటే ఎవ్వరి మనస్సైనా పరవశించిపోతుంది. మూడు దశాబ్దాలకు పైగా ఈ పాట అందరినీ అలరిస్తోంది. ఎన్నో భాషలు, యాసలు,ఎన్నెన్నో మతాలు,మరెన్నో సంస్కృతులు..సంప్రదాయాల సమ్మేళం మన భారతదేశం. ఆ భారతీయతను రెండు లైన్లలో పాడుకోగలిగేది..‘‘మిలే సుర్ర మేరా తుమ్హారా’’పాట. 1988 ఆగస్ట్ 15న దూరదర్శన్ లో  పండింట్ భీమ్‌సేన్‌జోషి గళం నుంచి ఈ పాటను తొలిసారిగా విన్నాం.
   
ఈ ‘మైల్ సుర్ మేరా తుమ్హారా’కు గానాన్ని  భారత 71 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండియన్ విస్లర్స్ అసోసియేషన్ (ఐడబ్ల్యుఎ) లోని 50 మంది సభ్యులు మైల్ సుర్ మేరా తుమ్హారా పాటను ఈలతో పాడారు. 18 భారతీయ నగరాలు, యుఎస్ఎ,మలేషియాలో ఈ పాట చిత్రీకరించబడింది. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఐడబ్ల్యుఎ విడుదల చేసిన ఆరు నిమిషాల మరియు 11 సెకన్ల నిడివి గల వీడియోను విడుదల చేసింది.

ఈ పాటతో 50 మంది భారతీయులు భారతదేశం..విదేశాలలోని 18 నగరాలు ఒక కళాకృతి ద్వారా ఐక్యమయ్యాయనీ..భాష, జాతి,మతం, ప్రాంతం, అనే వైవిధ్యాలను ఈ పాట ఐక్య చేసిందని తెలిపారు. ‘‘మైల్ సుర్ మేరా తుమ్హారా’’ అందరూ తమ తమ గళాలతో పంచుకుంటూ YouTube లో నివాళి అర్పించారు.

ఈ వీడియోను 83వేల మంది చూశారు. వందలాదిమంది అభినందనలు తెలిపారు. ఐపీఎల్ జట్టు చెన్సై సూపర్ కింగ్స్ కూడా ఈ పదర్శనను ప్రశంసించింది. తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. 

 

జాతీయ సమైక్యత సాటిచెప్పే ‘మైల్ సుర్ మేరా తుమ్హారా’ పండిట్ భీమ్సేన్ జోషి, లతా మంగేష్కర్, ఎమ్ బాలమురాలళీకృష్ణ వంటి సంగీత దిగ్గజాలను ఒకచోట చేర్చింది. ఇది అప్పటికీ ఎప్పటికీ ఐకానిక్ సాంగ్ అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 

మైల్ సుర్ మేరా తుమ్హారాలో ఐక్యత సందేశాన్ని సాహిత్యం ద్వారా మాత్రమే కాకుండా, వీడియోలో కనిపించిన వ్యక్తిత్వాల ద్వారా కూడా తెలియజేయబడింది. అమితాబ్ బచ్చన్, షబానా అజ్మీ, మల్లికా సారాభాయ్, హేమ మాలిని, కమల్ హాసన్, తనూజా, జావేద్ అక్తర్ ఈ పాటలో దేశంలోని ప్రతి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జాబితాలో భాగంగా ఉన్నారు.