కరోనావైరస్ నేపథ్యంలో విధించడిన దేశ లాక్‌డౌన్ వల్ల మనుషుల పరిస్థితి ఎలా ఉన్నా ప్రకృతి మాత్రం పులకించి పోతోంది. లాక్ డౌన్ తో…దశ్దాలకాలంలో ఎన్నడూ చూడని కొత్త విషయాలను ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా సాధ్యం కాని క్లీన్ గంగా…లాక్ డౌన్ తో సాధ్యమైంది. మీరట్‌లోని గంగానదిలో డాల్ఫిన్స్ కూడా కనిపించాయి. చాలా ప్రదేశాల్లో పొల్యూషన్ బాగా తగ్గిపోయింది.
అయితే ఇప్పుడు మూడు దశాబ్దాలలో మొదటిసారిగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని షహరాన్‌పూర్ సిటీ వాసులకు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచుతో కప్పబడిన హిమాలయాలు కూడా సృష్టంగా కనిపిస్తున్నాయి. షహరాన్‌పూర్ సిటీ నుంచి 200 కిలో మీటర్ల ఏరియల్ డిస్టెన్స్(ఉపరితల దూరం)లో ఉన్న గంగోత్రి, బంద్రాపంచ్ పర్వాతాలు 30 ఏళ్ల తర్వాత కనిపిస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. పొద్దునే లేచి టెర్రస్ పైకి వెళ్తే ఇన్నర్ హిమాలయాల్లోని గంగోత్రీ, బంద్రాపంచ్ పర్వతాలు కనిపించాయి.
ఇలాంటి అద్భుతం మళ్లీ ఎప్పటికి కలుగుతుందో అని వెంటనే ఫొటోలు క్లిక్ మనిపించాను అని ఇంకమ్ ట్యాక్స్ ఇన్స్‌పెక్టర్ దుశ్యంత్ కుమార్ ఆ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి. లాక్ డౌన్ మరియు అడపాదడపా వర్షాలు AQI ని గణనీయంగా మెరుగుపర్చాయని దుశ్యంత్ కుమార్ అన్నారు. మా జనరేషనంతా హిమాలయాలు కనిపించేవి కనిపించేవీ అని స్టోరీలు వింటూ బతికింది. కానీ ఇప్పుడు నిజంగా కనిపిస్తుంటే చాలా థ్రిల్లింగా ఉంది అని షహరాన్‌పూర్‌కు చెందిన స్థానికుడొకరు అన్నారు.
లాక్‌డౌన్ వల్ల పొల్యూషన్ తగ్గిపోయి గాలి కూడా స్వచ్ఛంగా తయారైందని అధికారులు తెలిపారు. లాక్ డౌన్ కారణంగా, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో ఒకటైన న్యూఢిల్లీలో, పొగమంచు గణనీయంగా తగ్గడంతో దాని AQI(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) లో గణనీయమైన మెరుగుదల నమోదైందని నివేదికలు తెలిపాయి. కాగా, గత నెల ప్రారంభంలో, పంజాబ్ లోని జలంధర్ సిటీ ప్రజలు..దశాబ్దాల తర్వాత 160కిలోమీటర్ల దూరంలోని హిమాచల్ ప్రదేశ్ లోని మంచుతో కప్పబడిన దౌలాదర్ హిమాలయ రేంజ్ ను చూడగలిగిన విషయం తెలిసిందే.