Blast : పశ్చిమ బెంగాల్ లో బాణాసంచా కర్మాగారంలో పేలుడు.. ఏడుగురు మృతి
కోల్‌కతాకు ఉత్తరాన 30 కిలోమీటర్ల దూరంలోని దత్తపుకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీల్‌గంజ్‌లోని మోష్‌పోల్‌లోని కర్మాగారంలో పలువురు వ్యక్తులు పనిచేస్తున్నప్పుడు ఉదయం 10 గంటలకు పేలుడు సంభవించిందని తెలిపారు.

blast in firecracker factory
Blast In Firecracker Factory : పశ్చిమ బెంగాల్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో ఆదివారం ఉదయం బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు.
కోల్‌కతాకు ఉత్తరాన 30 కిలోమీటర్ల దూరంలోని దత్తపుకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీల్‌గంజ్‌లోని మోష్‌పోల్‌లోని కర్మాగారంలో పలువురు వ్యక్తులు పనిచేస్తున్నప్పుడు ఉదయం 10 గంటలకు పేలుడు సంభవించిందని తెలిపారు. ఇప్పటి వరకు మూడు మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసు అధికారి పేర్కొన్నారు.
ఈ పేలుడులో పలువురు గాయపడ్డారని తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కాగా, గత మే నెలలో పుర్బా మేదినీపూర్ జిల్లా ఎగ్రాలో బాణాసంచా అక్రమ నిర్వహిస్తున్న కర్మాగారంలో పేలుడు సంభవించి 12 మంది మృతి చెందారు.