ప్రళయానికి సంకేతమా! : 2 గంటల్లో 9 భూకంపాలు

  • Published By: sreehari ,Published On : April 1, 2019 / 08:06 AM IST
ప్రళయానికి సంకేతమా! : 2 గంటల్లో 9 భూకంపాలు

Updated On : April 1, 2019 / 8:06 AM IST

ఏం జరుగుతుంది.. ప్రళయానికి ఇది సంకేతమా.. విపత్తుకు ముందు వచ్చే అలర్టా.. భూమి లోపల ఏం జరుగుతుంది.. ఎందుకు ఇలా
జరిగింది.. కేవలం 120 నిమిషాలు.. అంటే 2 గంటల్లో 9 భూకంపాలు వచ్చాయి.. ఎక్కడో కాదు.. మన అండమాన్ నికోబర్ దీవుల్లో. దీనిపై
ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. 2019 ఏప్రిల్ 1వ తేదీ తెల్లవారుజామున జరిగిన ఈ ప్రకంపనలను పరిశీలిస్తున్నారు శాస్త్రవేత్తలు. కారణాలను అన్వేషిస్తున్నారు. ఈ తొమ్మిది భూకంపాలు కూడా భూమికి 10 కిలోమీటర్ల లోతులోనే సంభవించాయి. 

భూకంపం టైమ్ – తీవ్రత 
మొదటి భూకంపం : ఉదయం 5.14 గంటలకు 4.9 తీవ్రత
రెండో భూకంపం : ఉదయం 5.519 గంటలకు 5 తీవ్రత
మూడో భూకంపం : ఉదయం 5.33 గంటలకు 5 తీవ్రత
నాలుగో భూకంపం : ఉదయం 5.34 గంటలకు 4.8 తీవ్రత
ఐదో భూకంపం : ఉదయం 6.04 గంటలకు 4.8 తీవ్రత
ఆరో భూకంపం : ఉదయం 6.19 గంటలకు 4.8 తీవ్రత
ఏడో భూకంపం : ఉదయం 6.28 గంటలకు 4.8 తీవ్రత
ఎనిమిదో భూకంపం : ఉదయం 6.41 గంటలకు 5.2 తీవ్రత
తొమ్మిదో భూకంపం : ఉదయం 6.54 గంటలకు 5.2 తీవ్రత

అండమాన్ నికోబర్ దీవుల్లో ఇలాంటి ప్రకంపనలు సహజమే అయినా.. అవి ఒకటి, రెండు, మూడు వరకు వస్తుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకు భిన్నంగా రెండు గంటల్లో 9 భూకంపాలు రావటం అనేది మాత్రం ఇదే అంటున్నారు. ఈ భూకంపాలతో అండమాన్ లో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఆస్తి నష్టంపై ఆరా తీస్తున్నారు. 
Read Also : శత్రువుల స్కెచేనా? : 5 ఏళ్ల కొడుకు ఎదుటే తండ్రి హత్య