India Oldest Martial Art: ప్రాచీన క్రీడ కోసం 78ఏళ్ల వయస్సులోనూ మహిళ ప్రాక్టీస్

కేరళకు చెందిన 78 ఏళ్ల వృద్ధురాలు మీనాక్షి దేశ పురాతన మార్షల్‌ ఆర్ట్‌ కలరిపయట్టులో ఇంకా ప్రాక్టీస్ చేస్తుండటమే కాకుండా యువతకు నేర్పిస్తూ కొత్త తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

India Oldest Martial Art: ప్రాచీన క్రీడ కోసం 78ఏళ్ల వయస్సులోనూ మహిళ ప్రాక్టీస్

Kalaripayattu

Updated On : October 1, 2021 / 6:54 PM IST

India Oldest Martial Art: మగాళ్లు ఆడే ఆటలు ఆడాళ్లకు ఎంట్రీ ఉండేది కాదు. నిదానంగా వాళ్లు కూడా ఆడటం మొదలెట్టేశారు. ప్రస్తుతం ఏ క్రికెట్టో, బ్యాడ్మింటనో తీసుకుంటే మగ, ఆడ తేడా లేకుండా ఆడేస్తున్నారు కానీ, ప్రాచీన క్రీడల జోలికి మాత్రం వెళ్లడం లేదు. ఈమె విషయానికొస్తే ఆ కథ వేరు.

కేరళకు చెందిన 78 ఏళ్ల వృద్ధురాలు మీనాక్షి దేశ పురాతన మార్షల్‌ ఆర్ట్‌ కలరిపయట్టులో ఇంకా ప్రాక్టీస్ చేస్తుండటమే కాకుండా యువతకు నేర్పిస్తూ కొత్త తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘ఏడేళ్ల వయసు నుంచే కలరి సాధన చేయడం ప్రారంభించా. ఇప్పటికీ ప్రాక్టీస్‌ చేయడమే కాక ఇతరులకు నేర్పుతున్నా కూడా’ అని తెలిపారు.

మీనాక్షి భర్త కలరిపయట్టు నేర్పే స్కూల్‌ని 1949లో ప్రారంభించారు. ఆయన మరణం తర్వాత మీనాక్షి స్కూల్‌ బాధ్యతలు ఈమే చూసుకుంటున్నారు. ‘రోజు ఉదయం పేపర్‌ తెరిచామంటే.. మహిళపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఏదో ఒక వార్త ఉంటుంది. అటువంటి అరాచకాల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి కలరిపయట్టు నేర్చుకోవడం చాలా ఉత్తమం. ఈ మార్షల్‌ ఆర్ట్‌ కళను నేర్చుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారు.

…………………………………………… : భోజనం చేయనివ్వలేదని..! పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన ఫొటోగ్రాఫర్
వ్యక్తిగతంగా నమ్మకం పెరుగుతుంది. ఒంటరిగా ఉద్యోగాలకు వెళ్లడం.. ప్రయాణాలు చేయాల్సొచ్చినా భయపడరు. కలరిపయట్టులో పూర్తిగా నిమగ్నమైతే శరీరమే కళ్లవుతాయి. దీనిలో రెండు రకాలుంటాయి. శాంతికి సంబంధించింది అయితే మరోకటి యుద్ధంలో వాడేది. కలరిపయట్టు నేర్చుకోవడం వల్ల మనసు, బుద్ధి, శరీరం, ఆత్మ పూర్తిగా శుద్ది అయి.. ఏకాగ్రత పెరుగుతుంది. వేగం, శాంతి పెరుగుతాయి. శారీరక, మానసిక శక్తి పునరుత్తేజమవుతోంది’ అన్నారు.

నృత్యం, యోగా అంశాలను కలిగి ఉన్న కలరిపయట్టులో కత్తులు, కవచాలు, వంటి ఆయుధాలు ఉంటాయి. కలరి 3వేల సంవత్సరాల పురాతనమైనది. దీని గురించి ప్రాచీన హిందూ గ్రంథాలలో ప్రస్తావించారు. బ్రిటీష్‌ పాలనలో కలరిపయట్టు సాధనపై నిషేధం విధించారు. స్వాతంత్య్రం వచ్చాక నిషేధాన్ని తొలగించినప్పటికి పూర్వ వైభవం రాలేదు. కాకపోతే 20వ శతాబ్దం ప్రారంభం నుంచి కలరిపయట్టుపై ఆసక్తి చూపే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది.