వాట్సాప్‌లో డీపీలా వరుడు ముఖం లేదంట.. పెళ్లి పీటలపై వద్దన్న వధువు!

వాట్సాప్‌లో డీపీలా వరుడు ముఖం లేదంట.. పెళ్లి పీటలపై వద్దన్న వధువు!

Updated On : March 6, 2021 / 9:59 PM IST

అసలే వాట్సాప్ కాలం.. వాట్సాప్ డీపీలు, స్టేటస్ లతోనే గడిచిపోతుంది. ఉదయం లేవగానే ముందు డీపీ, స్టేటస్ మార్చందే ఆ రోజు ముందుకు సాగని పరిస్థితి. వాట్సాప్ లో డీపీ చూసి పెళ్లికి ఓకే చెప్పిన వధువు.. పెళ్లిపీటలెక్కే చివరి నిముషంలో వరుడు ముఖం చూసి వద్దంది. ఎందుకంటే.. తాను వాట్సాప్ డీపీలో చూసినట్టుగా వరుడి ముఖం లేదని, అందుకే అతడు తనకు నచ్చలేదని నో చెప్పేసింది. ఈ ఘటన బీహార్‌లోని చంపారన్ జిల్లాలో జరిగింది.

బెట్టియాలోని షాంకియా ప్రాంతానికి చెందిన వరుడు అనిల్ కుమార్‌ తో చంపారన్‌ జిల్లాకు చెందిన యువతితో పెళ్లి ఫిక్స్ అయింది. వాట్సాప్‌లో పంపిన యువకుడి ఫొటో చూసిన యువతి పెళ్లికి ఓకే చెప్పింది. రెండు కుటుంబాలు పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇక పెళ్లితంతు ఒక్కటే మిగిలింది. పెళ్లి తేదీ ఫిక్స్ చేశారు. తాళి కట్టే సమయంలో మొదటిసారి పెళ్లికొడుకుని చూసి షాక్ అయింది. అతడి ముఖాన్ని చూసి నాకొద్దని ముఖాన్నే చెప్పేసింది.

వాట్సాప్‌ ఫొటోల్లో ఉన్నట్లుగా పెళ్లికొడుకు లేడని కుటుంబ సభ్యులకు చెప్పింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి వెళ్లిపోయింది. బంధువులు, కుటుంబసభ్యులు నచ్చజెప్పినా ఎవరి మాట వినలేదు. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవకు దారితీసింది. తాళికట్టే సమయంలో ఇలా నచ్చలేదని అవమానిస్తారా అంటూ వరుడు తరపు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.