Goat Eating Fish : పచ్చి చేపల్ని..పచ్చిగడ్డిలా తినేస్తున్న మేక..

ఆకులు తినే మేక చేపలు తింటోంది. పచ్చి గడ్డి తినే మేక పచ్చి చేపల్ని తింటున్నవీడియో వైరల్ అవుతోంది.

Goat Eating Fish : పచ్చి చేపల్ని..పచ్చిగడ్డిలా తినేస్తున్న మేక..

Goat Eting Fish

Updated On : September 24, 2021 / 1:45 PM IST

Viral Video: మేకలు ఏం తింటాయి? అని అడిగితే చిన్నపిల్లాడు కూడా చెప్పేస్తాడు ఠక్కుమని ఆకులు తింటాయి అని. పెద్దవాళ్లైనా అదే చెబుతారు. ఎందుకంటే మేకలు శాఖాహారం మాత్రమే తింటాయి కాబట్టి. దాదాపు జంతువులన్ని శాఖాహారమే తింటాయి. మేకలు,గొర్రెలు,ఆవులు,గేదెలు,జింకలు,భారీ శరీరంతో ఉండే ఖడ్గ మృగాలు కూడా పచ్చి గడ్డే తింటాయి.

Read more : Viral Video : ఈ వీడియో చూస్తే ఇంక బేకరీ ఫుడ్ తినరు–పిచ్చి చేష్టలు చేస్తున్న బేకరి వర్కర్లు

కానీ ఇదిగో ఈ వీడియో చూస్తే మాత్రం మేకలు శాఖాహారమే కాదు మాంసాహారం కూడా తింటాయా? అని షాక్ అవుతాం.ఎందుకంటే ఈ వీడియోలో ఓ మేక చేపల్ని పరపరా నమితి తినేస్తోంది. ఓ పెద్ద గిన్నెలో పచ్చి చేపలున్నాయి. ఆ చేపల్ని మేక చక్కగా లాగించేస్తోంది. ఈ మాంసాహారం మేకను చూస్తే ఎవ్వరైనా షాక్ అవుతారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకు చాలామంది చూశారు. ఏంటీ మేకలు కూడా చేపలుతింటాయా? అని షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన చాలామంది నేను మొదటిసారి చూస్తున్నా మేక తినడం అంటున్నారు. ఈ ఫన్నీ వీడియోని చూసి నెటిజన్లు భలే ఎంజాయ్‌ చేస్తున్నారు.