వామ్మో.. ఓ చేతిలో సంచి, మరో చేతిలో పామును పట్టుకుని ఆసుపత్రికి వెళ్లిన వృద్ధుడు.. ఎందుకో తెలుసా?

పాముని పట్టుకుని ఆసుపత్రికి తీసుకెళ్లడం ఏంటి?

వామ్మో.. ఓ చేతిలో సంచి, మరో చేతిలో పామును పట్టుకుని ఆసుపత్రికి వెళ్లిన వృద్ధుడు.. ఎందుకో తెలుసా?

Updated On : February 3, 2025 / 5:13 PM IST

ఓ చేతిలో సంచి, మరో చేతిలో పామును పట్టుకుని ఆసుపత్రికి వెళ్లాడు ఓ వృద్ధుడు. పామును చూసిన వైద్య సిబ్బంది దడుసుకున్నారు. అతడు చికిత్స చేయించుకోవడానికి వెళ్తూ వెళ్తూ పామును ఎందుకు తీసుకెళ్లాడో తెలుసా?

కేరళలోని పొన్నూరుకు చెందిన కన్నయ్యన్ (58) అనే కూలీ కాఫీ సాగు చేస్తున్న సమయంలో పాము కాటుకు గురయ్యాడు. దీంతో కన్నయ్యన్ భయపడకుండా ఆ పాముని పట్టుకున్నాడు. అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పామును కూడా కన్నయ్యన్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లాడు.

తండ్రి మృతదేహాన్ని రెండు భాగాలుగా చేసి తనకు ఓ భాగం ఇవ్వాలని అంత్యక్రియలకు అడ్డుపడ్డ వ్యక్తి

పాము కాటేస్తే కన్నయ్యన్ ఆసుపత్రికి రావడం సరైందే కానీ, మరి పామును ఎందుకు పట్టుకొచ్చాడని ఆసుపత్రి వైద్యులు అడిగాడు. దీంతో తనను ఏ పాము కరిచిందో వైద్యులకు చూపించేందుకు దాన్ని కూడా ఆసుపత్రి తీసుకొచ్చామని బాధితుడితో పాటు ఉన్న కొందరు కార్మికులు తెలిపారు.

ఏ పాము కరిచిందో తెలిస్తే చికిత్స మరింత సులువుగా చేయవచ్చని ఇలా పామును కూడా తీసుకొచ్చామని అన్నారు. అనంతరం పామును ఆసుపత్రి సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి వదిలేశారు. గూడలూరు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స తీసుకున్న కన్నయ్యన్‌ అనంతరం ఊటీ మెడికల్ కళాశాల ఆసుపత్రికి వెళ్లి ఇక్కడ చికిత్స పొందుతున్నాడు.