Odisha: పెన్షన్ తీసుకోవడానికి ఒక అవ్వ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.. విరిగిన కుర్చీ సాయంతో కిలోమీటర్ల దూరంలోని బ్యాంకుకు వెళ్లిన వీడియో చూస్తే గుండె తరుక్కు పోకుండా ఉండదు

ఈమె పట్ల అధికారులు అత్యంత నిర్లక్ష్యంతో వ్యవహరించారన్నది మాత్రం వాస్తవం. ఇలాంటివి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినప్పుడు తప్పితే అధికారులకు మెలకువ రావడం లేదు. వీడియో చూసిన నెటిజెన్లు అధికారులు, ప్రభుత్వాలపై మండిపడుతున్నారు

Odisha: పెన్షన్ తీసుకోవడానికి ఒక అవ్వ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.. విరిగిన కుర్చీ సాయంతో కిలోమీటర్ల దూరంలోని బ్యాంకుకు వెళ్లిన వీడియో చూస్తే గుండె తరుక్కు పోకుండా ఉండదు

Surya Harijan walks many kilometers barefoot with the support of a broken chair

Odisha: కాళ్లకు చెప్పులు లేవు, వయసు మీద పడి నడవనీకి ఒంట్లో సత్తువ లేదు. బతకడానికి గంజి మెతుకులు లేవు. ఉన్న ఒకే ఒక్క ఆధారం పెన్షన్. అది తీసుకోవాలంటే కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకుకు వెళ్లాలి. పెన్షన్ తీసుకుంటే కానీ కడుపులో గంజి మెతుకు పడదు. ఇంతటి దీన స్థితిలో నడవలేని పరిస్థితి అయినప్పటికీ విరిగిపోయిన కుర్చీని ఆసరగా చేసుకుని కిలోమీటర్ల దూరాన్ని దాటి అతి కష్టం మీద బ్యాంకుకు చేరుకుంది ఒక అవ్వ. ఇది ఈ ఒక్క అవ్వ పరిస్థితే కాదు. బయటికి కనిపించనివి, మన వరకు చేరని, మనం చూడని సందర్భాలెన్నో. రోడ్డు మీద కుర్చీ సాయంతో అవ్వ నడుస్తుండగా ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఇప్పుడిది నెటిజెన్లకు చేరింది.

TSRTC: ప్రయాణికుల పట్ల సత్‭ప్రవర్తనపై కండక్టర్లకు కీలక సూచన చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనర్

బహుశా.. ఇది వైరల్ అయిందనే కాబోలు.. బ్యాంకుకు చేరిన అవ్వకు ఇక నుంచి ఇంటికే పెన్షన్ తెచ్చి ఇస్తామని హామీ ఇచ్చారు. వెలుగులోకి రాకుండా, అధికారుల నిర్లక్ష్యానికి, అమానవీయత వల్ల చావును పణంగా పెట్టి బతుకీడ్చుతున్న వారు ఎందరో. తాజా ఘటన ఒడిశా రాష్ట్రంలో వెలుగు చూసింది. రాష్ట్రంలోని జరిగాన్ ప్రాంతంలో వెలుగు చూసిందీ ఘటన. జరిగాన్ లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచులో అవ్వకు అకౌంట్ ఉంది. నెల నెలా పెన్షన్ బ్యాంకు అకౌంట్లోనే జమ అవుతుంది. అయితే ఈ నెల పెన్షన్ తీసుకునేందుకు అవ్వ కుర్చీ సాయంతో, మండుటెండలో బ్యాంకుకు రావాల్సి వచ్చింది.

అవ్వకు చేతివేళ్లు విరిగిపోయాయట. దీంతో ఫింగర్ ప్రింట్ ఆధారంగా డబ్బులు తీసుకోలేక, తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లి పెన్షన్ తీసుకోవాల్సి వచ్చిందని బ్యాంకు మేనేజర్ అంటున్నారు. ఈ ఒక్క నెలనే ఇలా జరిగిందా, లేదా ప్రతి నెలా అవ్వ పరిస్థితి ఇదేనా అనే విషయం మాత్రం స్పష్టం కాలేదు. కానీ, ఈమె పట్ల అధికారులు అత్యంత నిర్లక్ష్యంతో వ్యవహరించారన్నది మాత్రం వాస్తవం. ఇలాంటివి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినప్పుడు తప్పితే అధికారులకు మెలకువ రావడం లేదు. వీడియో చూసిన నెటిజెన్లు అధికారులు, ప్రభుత్వాలపై మండిపడుతున్నారు. ‘వెయ్యి రూపాయల పెన్షన్ కోసం ప్రాణాలను పణంగా పెట్టిస్తారా?’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంత కష్టపడి వెళ్లిన అవ్వ పేరు సూర్య హరిజన్.