Aadhar To New Borns : పుట్టిన వెంటనే శిశువులకు ఆధార్ కార్డు..ఆస్పత్రి నుంచే ఇంటికి కార్డ్

పుట్టిన వెంటనే శిశువులకు ఆధార్ కార్డు జారీ కానుంది. ఇలా పుట్టగానే అలా ఆధార కార్డు పొందవచ్చు.

Aadhar issue To Newborns : ఆధార్ కార్డు. భారత్ పౌరులు గుర్తింపు కార్డు. అన్నింటికీ ఆధారే ‘ఆధారం’అన్నట్లుగా మారింది. ఆధార్ కార్డు అనేది ఇప్పుడు పుట్టిన వెంటనే పొందే సౌకర్యాన్ని కల్పించింది ప్రభుత్వం. ఇలా పుట్టగానే అలా ఆధార్ కార్డు పొందవచ్చు. నవజాత శిశువులకు ఆధార్ నంబర్లను ఇవ్వడానికి రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్స్‌తో టై-అప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తెలిపింది.

Read more : Wuhan lab Covid-19:క‌రోనా వైరస్ పుట్టింది ఉహాన్ ల్యాబ్‌లోనే..పార్ల‌మెంట్ కు తెలిపిన కెన‌డా శాస్త్ర‌వేత్త‌ డా.అలీనా చాన్

దీంతో పుట్టిన వెంటనే శిశువులకు ఆధార్ కార్డు జారీ కానుంది. దీనికోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సన్నాహాలు చేస్తోంది. పుట్టిన వెంటనే ఆసుపత్రులలోనే చిన్నారులకు ఆధార్ కార్డు జారీ చేసే విషయమై రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్‌ విభాగంతో చర్చలు జరుపుతున్నట్టు ఆధార్ సంస్థ సీఈవో సౌరభ్ గార్గ్ తెలిపారు. అంటే ఆస్పత్రిలో పుట్టిన శిశువు తన ‘ఆధార్ కార్డు’తో ఇంటికెళ్లొచ్చన్నమాట. మరి అప్పుడే పుట్టిన శిశువులకు..వేలిముద్రల గుర్తింపులు..ఐబాల్ గుర్తింపు ఎలా తీసుకుంటారు? అనే డౌట్ వస్తుంది. కానీ ఐదేళ్లలోపు చిన్నారులకు ఇటువంటివి అవసరం లేదు. కాబ్టి తల్లితండ్రుల్లో ఎవరో ఒకరి ఆధార్ కార్డుతో దానిని అనుసంధానం చేస్తామని సౌరభ్ తెలిపారు.

Read more : Leaves For Domestic Workers : కొత్త చట్టం..ఆయాలు, పని మనుషులకు వేతనంతో కూడిన సెలవులు..

ఇప్పటికే దేశంలోని 99.7 శాతం (137 కోట్లు) మందికి ఆధార్ కార్డులు జారీ చేసామని..ప్రతి సంవత్సరం రెండు నుంచి రెండున్నర కోట్ల మంది జన్మిస్తున్నారని..వారికి పుట్టిన వెంటనే ఆధార్ జారీ చేయటానికి యత్నిస్తుననామని సౌరభ్ గార్గ్ పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు