Leaves For Domestic Workers : కొత్త చట్టం..ఆయాలు, పని మనుషులకు వేతనంతో కూడిన సెలవులు..

ఇళ్లల్లో పిల్లల ఆలనాపాలనా చూసుకునే ఆయాలకు, పని మనుషులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాల్సిందేని కొత్త చట్టం స్పష్టం చేస్తోంది.

Leaves For Domestic Workers : కొత్త చట్టం..ఆయాలు, పని మనుషులకు వేతనంతో కూడిన సెలవులు..

New Project (9)

Sick leaves for domestic workers: ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కార్పొరేట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు కూడా వేతనంతో కూడిన సెలవులు ఉంటాయి. పలు రకాల లీవులు..వీక్లీ ఆఫ్ లు ఉంటాయి. కానీ అసంఘటిత రంగంలో పనిచేసేవారికి సెలవులు ఉండవు. అవసం కొద్దీ సెలవులు పెట్టినా జీతం కట్ అవుతుంది. ఉదాహరణకు ఇళ్లలోను, ఆఫీసులు వంటి పలు ప్రదేశాల్లో పనిచేసుకుని జీవించే పనిమనుషులకు సెలవులు ఉండవు. ఒకవేళ తీసుకున్నా జీతం కట్ చేస్తారు యజమానులు. అలా పనిమనుషుల, ఆయాలు, గార్డెనర్లకు ఇనుంచి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాల్సిందేనంటోంది చట్టం. దీనికి సంబంధించి అమెరికాలోని శాన్​ఫ్రాన్సిస్సో ఓ చట్టం తీసుకొస్తోంది.

Read more : Abortion Leaves : మహిళలకు వేతనంతో కూడిన గర్భస్రావ సెలవులు.. 

ఆయాలు, గార్డెనర్లతో పాటు ఇళ్లలో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన అనారోగ్య సెలవులు(పెయిడ్ సిక్ లీవ్) తప్పక ఇచ్చేలాగా అమెరికాలోని శాన్​ఫ్రాన్సిస్కో స్పష్టం చేస్తోంది. దీనికి సంబంధించి ఓ నిబంధన తీసుకొచ్చింది. దాన్ని చట్టం చేయనుంది. దీనికి శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి చెందిన సూపర్​వైజర్ల బోర్డు మంగళవారం (డిసెంబర్ 14,2021) ఏకగ్రీవంగా ఆమోదించింది. శాన్​ఫ్రాన్సిస్కో తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ నగరంలో పనిచేసే 10 వేల మందికి ప్రయోజనం చేకూనుంది.

ఇళ్లలో వంటపని, ఇంటిపని, గార్డెనింగ్, ఆయాలుగా ఉంటున్నవారికి అతి తక్కువ జీతాలు అందుతున్నాయి. పైగా వీరికి ఎటువంటి సెలవులు ఉండవు. ఒకవేళ ఎంతో అత్యవసరమై సెలవు తీసుకుంటే యజమానులు జీతం కట్ చేస్తారు. ఎన్ని రోజులు రాకపోతే అన్ని రోజులు జీతం కట్ చేసి ఇస్తారు. అటువంటివారికి నగర అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం ఉపశమనం కలిగించనుంది. అటువంటి కష్టజీవులకు న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని మిర్నా మెల్గార్ అనే ఓ అధికారి తెలిపారు. ప్రతి 30 గంటల పనికి ఒక గంట వేతనాన్ని సిక్​ లీవ్ ఫండ్​కు యజమానులు చెల్లించాలని తెలిపారు.

Read more : కండిషన్స్ అప్లై : నాన్నకు ఏడాది సెలవులు

అలాగే ఒకటికన్నా ఎక్కువ ఇళ్లలో పనిచేసే అవకాశం ఉన్నవారికి ఈ కొత్త చట్టంలో ఓ నిబంధన పొందుపరిచారు. వారు పని చేసిన గంటల ఆధారంగా సిక్ లీవ్​లు లభిస్తాయని..ఉదాహరణకు 30 గంటల పనిచేస్తే..ఒక గంట సిక్ లీవ్ అందుతుందని తెలిపారు. ఇలా వచ్చిన వాటిని ఏకం చేసి.. వారు ఒకేసారి ఈ సెలవులు తీసుకోవచ్చని కూడా తెలిపారు.

ఈ చట్టం అమలులోకి రావాలంటే మరోసారి సూపర్ వైజర్లు ఆమోదం పొందాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి అయ్యాక దానిపై నగర మేయర్ ఆమోదిస్తు సంతకం చేయాలి. ఈ ప్రక్రియ పూర్తై.. నిబంధనలు అమలయ్యేందుకు కొన్ని నెలలు పడుతుందని..కానీ జరగటం అయితే పక్కా అని చెబుతున్నారు అధికారులు.