మీ Aadhaar కార్డు పోయిందా.. కొత్తది ఇలా పొందండి!

  • Published By: sreehari ,Published On : January 13, 2020 / 11:33 AM IST
మీ Aadhaar కార్డు పోయిందా.. కొత్తది ఇలా పొందండి!

Updated On : August 21, 2020 / 6:30 PM IST

మీ ఆధార్ కార్డు పోయిందా? డోంట్ వర్రీ.. కొత్త ఆధార్ కార్డు పొందవచ్చు. అదే 12 అంకెల ఆధార్ నెంబర్ సాయంతో ఈజీగా కొత్త కార్డును తిరిగి పొందవచ్చు. కొత్త కార్డు కోసం ఆధార్ సెంటర్ వరకు వెళ్లాల్సాన పనిలేదు. ఉన్నచోటనే ఉండి.. ఆధార్ కార్డు ప్రాసెస్ పూర్తి చేయొచ్చు.

యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా UIDAI ఇటీవలే mAadhaar App లాంచ్ చేసింది. ఈ App ద్వారా అదే నెంబర్ తో కొత్త ఆధార్ కార్డు ఫ్రింట్ పొందవచ్చు. మీరు చేయాల్సిందిల్లా మీ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లి mAadhaar యాప్ డౌన్ లోడ్ చేసుకోవడమే..

దీని ద్వారా చాలా రకాలుగా సేవలను పొందవచ్చు. ఈ యాప్ తెలుగుతో పాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఆధార్ రీఫ్రింట్ కోసం యాప్ నుంచి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. దీనికి మీరు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

ఆ తర్వాత 15 రోజుల్లోగా మీరు ఇచ్చిన అడ్రస్ కు కొత్త ఆధార్ కార్డు డెలివరీ అవుతుంది. అంతే.. ఇంకెందుకు ఆలస్యం.. మీ ఆధార్ కార్డు కోసం వెంటనే ఈ mAadhaar App డౌన్ లోడ్ చేసి కొత్త ఆధార్ రీఫ్రింట్ చేసుకోండి..