ఓర్నాయనో.. ఓర్నాయనో.. ఇన్ని ఫ్రీ స్కీమ్స్.. మహిళలకు డబ్బులు.. ఢిల్లీలో ఆప్ మేనిఫెస్టో చూస్తే..
విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఢిల్లీ మెట్రో ప్రయాణంలో 50 శాతం రాయితీ కల్పిస్తామని మ్యానిఫెస్టోలో పొందుపరిచింది ఆప్.

AAP Manifesto 2025 : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం పూర్తి మేనిఫెస్టో విడుదల చేసింది ఆప్ పార్టీ. ఓటర్లను అట్రాక్ట్ చేసే విధంగా మ్యానిఫెస్టోను తయారు చేసింది. అన్ని వర్గాల వారిని తమవైపు తిప్పుకునేలా మ్యానిఫెస్టోలో వరాల జల్లు కురిపించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆప్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులు లేని రాజధానిగా ఢిల్లీని మారుస్తామంది.
యువతకు ఉద్యోగాలు, 24 గంటల పాటు నీటి సరఫరా..
అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగాలు ఇస్తామంది. ఇక, మహిళల కోసం మహిళా సమ్మాన్ యోజన పథకం ప్రకటించింది. ఈ స్కీమ్ కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.2,100 ఇస్తామంది. హెల్త్ కి సంబంధించి కొత్త స్కీమ్ ని అనౌన్స్ చేసింది. అదే సంజీవని పథకం. ఈ స్కీమ్ కింద 60 ఏళ్లు నిండిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులోనూ ఉచిత వైద్యం అందిస్తామంది. అంతేకాదు నీటి సరఫరా బిల్లులు మాఫీ చేస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. 24 గంటల పాటు నీటిని సరఫరా చేస్తామంది.
Also Read : గద్దర్‌కు ‘పద్మ అవార్డు’పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
యూరప్ లో మాదిరిగా రోడ్ల నిర్మాణం..
యూరప్ లో మాదిరిగా రోడ్ల నిర్మాణం చేపడతామంది. యమునా నదిని శుభ్రం చేస్తామంది. డాక్టర్ అంబేడ్కర్ స్కాలర్ షిప్ స్కీమ్, విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఢిల్లీ మెట్రో ప్రయాణంలో 50 శాతం రాయితీ కల్పిస్తామని మ్యానిఫెస్టోలో పొందుపరిచింది ఆప్. ఇక, పూజారులు, గ్రంథీలు ఒక్కొక్కరికి 18 వేల రూపాయలు ఇస్తామంది.
Also Read : మౌని అమావాస్య వచ్చేస్తుంది.. ఏం చేయాలి? ఏం చేయొద్దు.. ఏం ఫలం లభిస్తుంది.. ఫుల్ డిటెయిల్స్..
కిరాయిదారులకు ఉచిత కరెంట్ తో పాటు ఉచిత నీటి సౌకర్యం..
కిరాయిదారులకు ఉచిత కరెంట్ తో పాటు ఉచిత నీటి సౌకర్యం ఇస్తామంది. డ్రైనేజీ వ్యవస్థకు పరిష్కారాలు చూస్తామంది. అలాగే కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఇక ఆటో, టాక్సీ, ఈ-రిక్షా డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని ఆప్ హామీ ఇచ్చింది. అంతేకాదు వారి పిల్లలకు ఉచిత కోచింగ్ ఇస్తామంది. జీవిత బీమా కూడా కల్పిస్తామంది. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు ప్రైవేట్ గార్డులను అందిస్తామని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆప్ పొందుపరిచింది.
గత రెండు ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించి అధికారం దక్కించుకుంది. 2015 ఎన్నికల్లో ఆ పార్టీకి 67 సీట్ల వచ్చాయి. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 62 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆప్ పట్టుదలగా ఉంది. మూడోసారి కూడా విజయం సాధించి అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు ఆప్ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునేలా ఆప్ తన ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించింది.