AAP in Punjab: పంజాబ్ ఎన్నికల కోసం పది పాయింట్లతో ఆప్ రెడీ

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఫోకస్ ఎక్కువగా కనబరుస్తుంది. వచ్చే వారమే పంజాబ్ సీఎం అభ్యర్థి పేరు ప్రకటిస్తామని చెప్పారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈ సందర్భంగా ఆప్..

AAP in Punjab: పంజాబ్ ఎన్నికల కోసం పది పాయింట్లతో ఆప్ రెడీ

Arvind Kejriwal

Updated On : January 12, 2022 / 1:01 PM IST

AAP in Punjab: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఫోకస్ ఎక్కువగా కనబరుస్తుంది. వచ్చే వారమే పంజాబ్ సీఎం అభ్యర్థి పేరు ప్రకటిస్తామని చెప్పారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈ సందర్భంగా ఆప్.. పంజాబ్‌లో అభివృద్ధికి సంబంధించి 10 పాయింట్ల పంజాబ్ మోడల్ సిద్దం చేసింది. తాము అధికారంలోకి వస్తే ఈ పది పాయింట్లను కచ్చితంగా అమలుచేస్తామని హామీ ఇచ్చింది.

1. ఉపాధి కోసం కెనడా వెళ్లిన పంజాబీలు తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తాం.

2. ప్రశాంతమైన పంజాబ్, సంపన్న పంజాబ్‌గా తీర్చిదిద్దుతాం.

3. పంజాబ్ నుండి మాదకద్రవ్యాల సిండికేట్‌ను తుడిచివేస్తాం

4. త్యాగాల కేసులలో అమరులైన వారి కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తాం.

5. అవినీతిని అంతమొందిస్తాం.

6. 16వేల మొహల్లా క్లినిక్‌లను ఏర్పాటు చేసి, ప్రతి పంజాబీకి ఉచిత చికిత్స అందిస్తాం

7. 24/7 ఉచిత విద్యుత్ కూడా అందించేందుకు ప్రయత్నిస్తాం.

8. పంజాబ్ లో 18ఏళ్ల వయస్సు దాటిన యువతులకు నెలకు వెయ్యి రూపాయలు

9. రైతుల సమస్యలు తీర్చడం.

10. ప్రో బిజినెస్ గవర్నెన్స్

ఈ పది అంశాలతో పంజాబ్ మోడల్ గా తీర్చిదిద్దుతామని కేజ్రీవాల్ ప్రెస్ మీట్ లో వెల్లడించారు.