AAP: మీ డిగ్రీ చూపించండి.. బీజేపీని ఇరుకున పెట్టేలా ఆప్ కొత్త ప్రోగ్రాం.. ఇది నా ఒరిజినల్ డిగ్రీ అని చూపిన ఢిల్లీ మంత్రి

"ఆక్స్ ఫర్డ్ నుంచి నాకు రెండు మాస్టర్ డిగ్రీలు ఉన్నాయి. అవన్నీ ఒరిజినల్ డిగ్రీలే. అందరు నేతలనూ నేను కోరుతున్నాను.. మీ డిగ్రీలు చూపించండి" అని మంత్రి అతిశీ చెప్పారు.

AAP: మీ డిగ్రీ చూపించండి.. బీజేపీని ఇరుకున పెట్టేలా ఆప్ కొత్త ప్రోగ్రాం.. ఇది నా ఒరిజినల్ డిగ్రీ అని చూపిన ఢిల్లీ మంత్రి

AAP

Updated On : April 9, 2023 / 8:40 PM IST

AAP: “మీ డిగ్రీ చూపించండి” పేరిట ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party- AAP) ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)కి సంబంధించిన డిగ్రీ, పీజీ డిగ్రీ సర్టిఫికెట్లను బయటకు చూపించాల్సిన అవసరం లేదని ఇటీవలే గుజరాత్ హైకోర్టు (Gujarat High Court) తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

Delhi Education Minister Atishi

Delhi Education Minister Atishi

ఆ వివరాలు అడుగుతూ కోర్టుకు వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal )కు హైకోర్టు రూ.25,000 జరిమానా కూడా విధించింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ “మీ డిగ్రీ చూపించండి” (Show Your Degree Campaign)పేరిట బీజేపీని చిక్కుల్లో పడేసేలా కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ఆప్ నాయకురాలు, ఢిల్లీ విద్యా శాఖ మంత్రి అతిశీ (Delhi Education Minister Atishi) ఇవాళ వివరాలు తెలిపారు.

నేటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. మీ నేతలు మీకు ప్రతిరోజు వారి డిగ్రీలు చూపెడతారు. “ఢిల్లీ యూనివర్సిటీ నుంచి నాకు ఓ బీఏ డిగ్రీ ఉంది. అలాగే, ఆక్స్ ఫర్డ్ నుంచి రెండు మాస్టర్ డిగ్రీలు ఉన్నాయి. అవన్నీ ఒరిజినల్ డిగ్రీలే. అందరు నేతలనూ నేను కోరుతున్నాను.. మీ డిగ్రీలు చూపించండి.. ప్రత్యేకంగా బీజేపీ నేతలు చూపించాలి. మీ డిగ్రీ చూపించండి కార్యక్రమంలో భాగంగా ఆప్ నేతలు మొదట వారి డిగ్రీలు చూపిస్తారు” అని అతిశీ చెప్పారు.

కాగా, మోదీకి సంబంధించి పీఎంవో (PMO) అటువంటి వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని ఇటీవలే గుజరాత్ హైకోర్టు పేర్కొంది. గతంలో, మోదీ విద్యార్హతల ఆధారాలు చూపాలని పీఎంవో ప్రజా సమాచార అధికారికి ప్రధాన సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కూడా గుజరాత్ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం పక్కనపెట్టింది.

TS SSC leak Case: తన ఫోను పోయిందని పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు