రైళ్లు తిరుగుతున్నాయంటూ ప్రచారం చేసి వేలాది మంది రోడ్డెక్కడానికి కారణమైన జర్నలిస్టు అరెస్ట్

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని మోడీ నుంచి ప్రకటన వెలువడగానే.. వలసకూలీలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చేశారు. ముఖ్యంగా ముంబైలోని బాంద్రా

  • Published By: veegamteam ,Published On : April 16, 2020 / 02:01 AM IST
రైళ్లు తిరుగుతున్నాయంటూ ప్రచారం చేసి వేలాది మంది రోడ్డెక్కడానికి కారణమైన జర్నలిస్టు అరెస్ట్

Updated On : April 16, 2020 / 2:01 AM IST

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని మోడీ నుంచి ప్రకటన వెలువడగానే.. వలసకూలీలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చేశారు. ముఖ్యంగా ముంబైలోని బాంద్రా

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని మోడీ నుంచి ప్రకటన వెలువడగానే.. వలసకూలీలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చేశారు. ముఖ్యంగా ముంబైలోని బాంద్రా పశ్చిమ రైల్వే స్టేషన్‌కు భారీ సంఖ్యలో చేరుకున్న వలసకూలీలు.. ఆంక్షలను ధిక్కరించి ఆందోళనకు దిగారు. తమను స్వస్థలాలకు పంపించాలంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

బాంద్రా రైల్వేస్టేషన్‌ దగ్గర వేల సంఖ్యలో వలస కార్మికులు గుమిగూడటం కలకలం రేపింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఎంక్వైరీ చేశారు. వారిలా రోడ్డు మీదకు రావడానికి కారణం రైళ్లు తిరుగుతున్నాయనే వార్త అని గుర్తించారు. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాఫ్తు చేపట్టారు. ఆ వార్తను ప్రచారం చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి పేరు రాహుల్ కులకర్ణి. ఓ టీవీ జర్నలిస్టు(ఏబీపీ). ఏప్రిల్‌ 14 నుంచి రైళ్లు ప్రారంభం అవుతాయంటూ… రిపోర్టర్ రాహుల్‌ కులకర్ణి చేసిన ప్రచారమే ఈ ఘటనకు కారణమైందని పోలీసులు గుర్తించారు. రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నట్టు రాహుల్‌ ఇచ్చిన తప్పుడు సమాచారం వల్లే వలసకూలీలు అక్కడికి భారీగా తరలివచ్చారని వివరించారు.

ఉస్మానాబాద్‌లో అతడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఐపీసీ సెక్షన్‌ 117, 188, 299, 270 కింద కేసులు నమోదు చేశారు. అంటు వ్యాధుల చట్టం 1897లోని సెక్షన్‌ 3 ప్రకారం కూడా కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న రాహుల్‌ను అరెస్ట్‌ చేశామని.. కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు.

భారీగా వలసకూలీలు బాంద్రా రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి అంతమంది ఒకచోట చేరడంతో అధికార యంత్రాంగం, ప్రభుత్వ పెద్దల్లో కలవరం రేగింది. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ముంబైలో పరిణామాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో ఫోన్‌లో మాట్లాడారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉండగానే వందలాదిగా జనం గుమికూడటంపై ఆందోళన వ్యక్తం చేశారు. 

Also Read | కరోనాను తట్టుకోగల శక్తి గబ్బిలాల్లో ఏముంది? మనుషులకు గబ్బిలాలకు మధ్య వాహకం ఏంటి?