Aishwarya Rai Eating food : మిస్ వరల్డ్ కిరీటంతో నేలపై కూర్చొని భోజనం చేస్తున్న ఐశ్వర్య రాయ్..
ఐశ్వర్య రాయ్ పేరు చెబితే అందమే గుర్తుకొస్తుంది. అందానికే అందంగా మెరిసిపోయే ఐశ్వర్య రాయ్ 1994లో మిస్ వరల్డ్ పోటీలో విజేతగా నిలిచారు. మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న ఐశ్వర్యారాయ్ ఈ కిరీటంతోనే తన తల్లితో నేలపైనే కూర్చుని భోజనం చేసిన ఫోటోని ప్రముఖ నటి అమీ జాక్సన్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Aishwarya Rai Eating Food On Floor
Aishwarya Rai eating food on floor : ఐశ్వర్య రాయ్ పేరు చెబితే అందమే గుర్తుకొస్తుంది. అందానికే అందంగా మెరిసిపోయే ఐశ్వర్య రాయ్ 1994లో మిస్ వరల్డ్ పోటీలో విజేతగా నిలిచారు. మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అలనాడు మిస్ వరల్డ్ గా గెలుపొందిన తరువాత ఐశ్వర్యారాయ్ ఈ కిరీటంతోనే తన తల్లితో నేలపైనే కూర్చుని భోజనం చేసారు. ఆ ఫోటోని ప్రముఖ నటి అమీ జాక్సన్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఐశ్వర్యారాయ్ తన తల్లి బృందతో కలిసి మిస్ వరల్డ్ కిరీటంతోనే నేలపై కూర్చుని భోజనం చేస్తున్న ఫోటోను అమీ జాక్సన్ షేర్ చేశారు. ఈ ఫోటోలు ఐశ్వర్యారాయ్ మిస్ వరల్డ్ కిరీటంతోనే మెరూన్ కలర్ చీరలో తల్లి బృందాతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేస్తున్నారు. పైగా ఆమె తన స్వహస్తాలతోనే భోజనం చేస్తున్నారు. స్పూన్లు, ఫోర్కులు లాంటివి ఉపయోగించకుండా. ఈ సందర్భంగా అమీ జాక్సన్ ‘ఎప్పటికీ ఇష్టమైన’ ఐశ్వర్య రాయ్ అని వ్యాఖ్యానించారు. ఆమె ఐశ్వర్కు ‘రాణి’ ఎప్పటికీ ఇష్టమనది అని రాశారు.
1994 లో మిస్ ఇండియా పోటీలో ఐశ్వర్య మొదటి రన్నరప్. ఆమె కిరీటాన్ని సుష్మితా సేన్ చేతిలో కోల్పోయింది. తరువాత, ఇద్దరూ వరుసగా మిస్ వరల్డ్ మరియు మిస్ యూనివర్స్ కిరీటాలను గెలుచుకున్నారు.ఐశ్వర్య, అమీలకు కూడా మరో సంబంధం ఉంది. 2010 నాటి ఎన్‌తిరాన్‌లో రజనీకాంత్ సరసన ఐశ్వర్య ప్రధాన పాత్రలో నటించగా, 2018 లో విడుదలైన రోబోట్ 2 సీక్వెల్ లో అమీ నటించారు. రోబో-2 సినిమా గురించి అమీ మాట్లాడుతూ.. ఐశ్వర్య స్థానంలో తనను తీసుకోవటం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని అన్నారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఒక స్ఫూర్తిదాయకమైన మహిళ. నేను రోబో సినిమా చాలాసార్లు చూశాను. ఐశ్వర్యలా నటించాలని చాలారకాలుగా యత్నించాను. కానీ కాని రోబో 1కు రోబో -2లో నా పాత్రకు సంబంధం లేదు అని తెలిపారు.
అమీ జాక్సన్ కూడా 2009లో మిస్ టీన్ వరల్డ్ గానూ, 2010లో మిల్ లివర్ పూల్ గానూ గెలుపొందారు. అంతేకాదు..2010 లో మిస్ ఇంగ్లాండ్ టైటిల్ పోటీల్లో రన్నరప్ కిరీటాన్ని గెలుపొందారు. 6 ఏళ్లకే మోడల్ గా కెరీర్ ప్రారంభించిన అమీ పలు సినిమాల్లో కూడా నటించారు. అమీ పూర్తి పేరు అమీ లొయిస్ జాక్సన్.అమీ జాక్సన్ ఐరిష్ సముద్రం మధ్యలోని ఐస్లే ఆఫ్ మాన్ అనే ద్వీపంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు బ్రిటీష్ క్రిస్టియన్స్. ఆమె తండ్రి అలన్ జక్సన్, తల్లి మార్గరీటా జాక్సన్. ఆమె అక్క అలిసియా జాక్సన్. అమీ జన్మించిన రెండేళ్ళకే వారి కుటుంబం లివర్ పూల్ లోని వూల్టన్ లో వారి స్వంత ఇంటికి మారిపోయింది. ఆమె తండ్రి బిబిసి రేడియో మెర్సిసిడ్ కు నిర్మాత. ప్రముఖ నటుడు విక్రమ్ నటించిన ‘ఐ’సినిమాలో అమీ జాక్సన్ తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది.
అలా ఎమీ లండన్ లో మోడల్ గా కెరీర్ కొనసాగిస్తున్న సమయంలోనే, భారత్ లో వివిధ భాషల్లోని సినిమాల్లో నటించడం ప్రారంభించింది. 2012లో ఆమె నటించిన మొదటి బాలీవుడ్ సినిమా ఏక్ దీవానా థా విడుదలైంది. అదే సంత్సరం మొదటి తెలుగు సినిమా ఎవడు విడుదలైంది. ఆ తరువాత 2015లో ప్రభుదేవా దర్శకత్వంలో,అక్షయ్ కుమార్ నటించిన సింగ్ ఈజ్ బ్లింగ్ సినిమాలో నటించారు.
View this post on Instagram