Kangana Ranaut Bodyguard: మహిళను మోసం చేసిన కేసులో కంగనా బాడీగార్డు అరెస్టు
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ బాడీగార్డు మహిళను మోసం చేసిన కేసులో అరెస్ట్ అయ్యారు. కర్ణాటకలోని అతని సొంతూరులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Kangana Ranaut Bodyguard
Kangana Ranaut bodyguard: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ బాడీగార్డు మహిళను మోసం చేసిన కేసులో అరెస్ట్ అయ్యారు. కర్ణాటకలోని అతని సొంతూరులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి చెందిన మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి మోసం చేసినట్లు వెల్లడైంది.
ముంబై పోలీసులు శనివారం హెగ్గదహల్లీ ప్రాంతానికి వచ్చి కుమార్ హెగ్దేను అరెస్టు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వేరే వ్యక్తితో సంబంధానికి రెడీ అయిపోయినట్లుగా తెలిసింది. ముంబై నుంచి సొంతూరుకి వెళ్లిపోయిన అతను అక్కడే ఉండిపోయినట్లు వెల్లడించారు.