Maharashtra: ఉద్దవ్ ఠాక్రే వర్గానికి మరో ఎదురుదెబ్బ.. షిండే జట్టులోకి ఆదిత్య ఠాక్రే సన్నిహితుడు రాహుల్ కనల్
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆధిత్య ఠాక్రే సన్నిహితుడు రాహుల్ నారాయణ్ కనల్ ఉద్ధవ్ శిబిరాన్ని వీడారు.

Rahul Kanal
Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆధిత్య ఠాక్రే సన్నిహితుడు రాహుల్ నారాయణ్ కనల్ ఉద్ధవ్ శిబిరాన్ని వీడారు. ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరనున్నారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతికి వ్యతిరేకంగా ఆధిత్య ఠాక్రే నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహిస్తున్న రోజునే రాహుల్ కనల్ ఉద్ధవ్ వర్గాన్ని వీడటం గమనార్హం. ఆథిత్య థాకరే నేతృత్వంలోని శివసేన యువసేనలో కనాల్ చురుకైన నేతగా ఉన్నారు. అయితే, సహాబాంద్రా వెస్ట్‌లోని యువసేనకు సంబంధించిన కనల్‌తో సహా అన్ని ఆఫీస్ బేరర్లను శివసేన తొలగించడంతో ట్విటర్‌లో తన నిరాశను వ్యక్తం చేశాడు. బాధపడుతున్నానని అని ట్వీట్ లో కనల్ పేర్కొన్నారు.
Maharashtra Politics: ఈపాటికి సీఎం షిండే ఆత్మహత్య చేసుకునేవారు.. మహా విద్యామంత్రి సంచలన వ్యాఖ్యలు
రాహుల్ కనల్ తన ట్విటర్ ఖాతా ద్వారా.. ఇంది ఎవరో చేశారో బాగా తెలుసు. కానీ వినకుండా మీకోసం పనిచేసిన వారిని తొలగించడం అహంకారం. మీరు నన్ను తొలగించగలరు. కానీ ఇంకా పగలు, రాత్రి పనిచేసిన వ్యక్తులను తొలగించలేరు అని రాశారు. గతంలో మిస్టర్ కనల్ శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్‌కు ట్రస్టీగా నియమితులయ్యారు. 2017లో బీఎంసీ విద్యా కమిటీ సభ్యుడుగా కూడా కొనసాగారు. కనల్ బాద్రాలో 10 సంవత్సరాల క్రితం యువసేన స్థాపించబడినప్పటి నుండి ఆధిత్యకు సన్నిహితుడిగా ఉన్నారు. ఇదిలాఉంటే ఇటీవలే ఎమ్మెల్సీ మనీషా కయాండే ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనను వీడి షిండే వర్గంలో చేరారు. ఆమె ఉద్దవ్ వర్గంలో సీనియర్ మహిళా నేత.
Uddhav Thackeray: ఉద్దవ్ ఠాక్రే వర్గాన్ని వీడిన ఎమ్మెల్సీ మనీషా.. షిండే వర్గంలోకి జంప్..
ఉద్దవ్ ఠాక్రేపై రాహుల్ నారాయణ్ కనల్ విమర్శలు గుప్పించారు. కొంతమంది వ్యక్తుల కోరిక మేరకు, వారి సలహా మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. నేను రేపు(ఆదివారం) మధ్యాహ్నం 12గంటలకు సీఎం ఏక్‌నాథ్ షిండే గ్రూపులో చేరబోతున్నానని, చాలా మంది కార్యకర్తలు నాతో నాతో షిండే గ్రూపులో చేరుతారని రాహుల్ కనల్ తెలిపినట్లు ఏఎన్ఐ పేర్కొంది.
Feeling Sad !!! Very well know who has done this but removing people who have worked for you without a hearing is arrogance and you could remove me but not the people who have worked day and night yet Chalo acha hai sabko pata chale ke Ego Aur arrogance kya hota hai !!! pic.twitter.com/JFlB9uZjUU
— Rrahul Narain Kanal (@Iamrahulkanal) June 30, 2023