Cute video : తల్లితో సింహం పిల్ల ఆటలు..ఫిదా అయిపోతున్న నెటిజన్లు

తల్లితో సింహం పిల్లలు ఆటలు అందమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Cute video : తల్లితో సింహం పిల్ల ఆటలు..ఫిదా అయిపోతున్న నెటిజన్లు

Adorable Viral Video Of A Lion Cub Playing

Updated On : August 12, 2021 / 4:02 PM IST

lion cub playing : మనిషి అయినా,పక్షులైనా, జంతువైనా,క్రూరమృగమైనా బిడ్డల విషయంలో తల్లి తల్లే. బిడ్డకు ఆకలేస్తే అమ్మ మనస్సు ఆగదు.అలాగే బిడ్డతో కలిసి ఆటా పాటా అంటే తల్లికి ఎంతో ఇష్టం. తల్లి పిల్లల ఆటలు చూడటానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. అమ్మతో కలిసి ఆడే బిడ్డ ప్రపంచం అంతా అమ్మలాగే కనిపిస్తుంది.అలాగే తల్లి కూడా బిడ్డతోనే లోకం అనుకుంటుంది. అది మనిషి అయినా జంతువైనా సరే తల్లీ బిడ్డల ప్రేమకు ఎవరైనా ఒక్కటే.

అలాంటి ఓ తల్లీ బిడ్డల ఆటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ తల్లి ఓ సింహం. ఆ పిల్ల దాని కూన. తల్లితో సింహం పిల్ల ముద్దు ముద్దుగా ఆడుకుంటోంది. కానీ తల్లి సింహం పిల్లను పట్టించుకోలేదు. దాంతో ఆ సింహం పిల్ల కాస్త అలిగినట్లుగా తల్లికి దూరంగా చిన్న చిన్నగా అరుచుకుంటూ వెళ్లిపోయి ఇసుకలో పడుకుని తల్లి వంక చూస్తోంది.

అప్పడు తల్లి సింహం పిల్ల సింహం వద్దకు వచ్చి బిడ్డతో ఆడుకుంటున్న వీడియో ఐఎఫ్ ఎస్ ఆఫీసర్ సురేందర్ మెహ్రా లో షేర్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.