African Swine Fever In Kerala: కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కలకలం.. రెండు జిల్లాల్లో హై అలర్ట్ ..
కేరళ రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కలకలం సృష్టించింది. ఆ రాష్ట్రంలోని వాయనాడ్ జిల్లాలో పందులలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ను అధికారులు గుర్తించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తర కేరళలోని రెండు జిల్లాల్లో (వాయనాడ్, కోజికోడ్) హై అలర్ట్ ప్రకటించామని వైద్య శాఖ అధికారులు తెలిపారు.

African Swine Fever
African Swine Fever In Kerala: కేరళ రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కలకలం సృష్టించింది. ఆ రాష్ట్రంలోని వాయనాడ్ జిల్లాలో పందులలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ను అధికారులు గుర్తించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తర కేరళలోని రెండు జిల్లాల్లో (వాయనాడ్, కోజికోడ్) హై అలర్ట్ ప్రకటించామని వైద్య శాఖ అధికారులు తెలిపారు. భోపాల్‌లోని నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ హై సెక్యూర్టీ యానిమల్ డిసీజెస్ కు పంపిన నమూనాల్లో వ్యాధి నిర్ధారణ అయిందని తెలిపారు.
African Swine Fever: అసోంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ గుర్తింపు
వాయనాడ్ పరిధిలోని ఓ ఫార్మ్ హౌజ్‌లో భారీ సంఖ్యలో పందులు చనిపోవటం వల్ల శ్యాంపిళ్లను టెస్టింగ్‌కు పంపామని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. అయితే ఐదు పందుల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని, కేసులు నమోదైన ఫాంలోని పందులను రెండు కిలోమీటర్ల పరిధిలో వధించాలని యోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు. హయనాడ్ సమీపంలోని మూడు పందుల ఫాంలలో దాదాపు 300 పందులను శుక్రవారం సాయంత్రం వరకు వధించటం జరుగుతుందని అధికారి ఒకరు తెలిపారు.
High BP : బీపీ అధికంగా ఉంటే! తినే ఆహారం విషయంలో..
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ జంతువుల నుండి మానవులకు సంక్రమించడం చాలా అరుదు అని నిపుణులు చెబుతున్నప్పటికీ.. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, ఈ మేరకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి చంచు రాణి తెలిపారు. వాయనాడ్‌తో పాటు కోజికోడ్ జిల్లాలో కూడా అలర్ట్ ప్రకటించారు. రెండు వారాల క్రితం కేరళ ప్రభుత్వం పొరుగు రాష్ట్రాల నుండి పందులను, వాటి మాంసాన్ని రవాణా చేయడాన్ని నిషేధించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపిన వివరాల ప్రకారం.. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది అడవి పందులు, పెంపుడు పందులలో ఎక్కువగా కనిపించే అంటువ్యాధి. ఈ వ్యాధి సోకితే మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యాధికి వ్యాక్సిన్ లేదు. ఇది మానవులకు పెద్ద ముప్పు కాదు. అయితే ఇది పందుల పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగించే రైతుల జీవనోపాధిని భారీగా దెబ్బతీస్తుందని పేర్కొంది