High BP : బీపీ అధికంగా ఉంటే! తినే ఆహారం విషయంలో..

రక్తపోటు పెరగటానికి ప్రధానంగా ఉప్పు దోహదం చేస్తుంది. అందువల్ల ఆహారంలో రోజుకు 3-4 గ్రాములకు ఉప్పు మించరాదు. పప్పుదినుసులు, గింజలు, చేపలు వంటి ఆహారాన్ని తీసుకోవాలి. హైబీపీ తో బాధపడే వారు సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడంవల్ల మంచి ఫలితం ఉంటుంది.

High BP : బీపీ అధికంగా ఉంటే!  తినే ఆహారం విషయంలో..

Food

High BP : అధిక రక్తపోటు నియంత్రణలో లేకపోతే భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. బరువు అధికంగా ఉండి రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

అధిక బీపీ ఉన్నవారు ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. నూనెతో తయారు చేసిన వేపుళ్లు, చిరుతిళ్లు, బేకరీ ఫుడ్స్, మటన్ వంటి వాటికి దూరంగా ఉండాలి. బీపీ రోగులు ప్రాసెస్ చేసిన మాంసానికి దూరంగా ఉండటం మంచిది. మార్కెట్‌లో ప్యాక్ చేసిన ఆహారాలకు బదులు ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. బీపీ రోగులకు కాఫీ తాగే అలవాటుంటే అందులో ఉండే కెఫిన్ రక్తపోటును పెంచుతుందని గుర్తుంచుకోవాలి. బీపీ రోగులు కాఫీ తాగకపోవటమే మేలు.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి ;

రక్తపోటు పెరగటానికి ప్రధానంగా ఉప్పు దోహదం చేస్తుంది. అందువల్ల ఆహారంలో రోజుకు 3-4 గ్రాములకు ఉప్పు మించరాదు. పప్పుదినుసులు, గింజలు, చేపలు వంటి ఆహారాన్ని తీసుకోవాలి. హైబీపీ తో బాధపడే వారు సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడంవల్ల మంచి ఫలితం ఉంటుంది. ద్రాక్ష ,
కమలాలు, నిమ్మ మొదలైన సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్స్, యాంటి ఆక్సిడెంట్స్, మినరల్స్ తక్కువగా ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ ను తగ్గించడానికి తోడ్పడతాయి. ఆకుకూరలు రోజు వారిగా తీసుకోవటం చాలా మంచిది. కాల్షియం, మెగ్నీషియం ఆకుకూరలద్వారా శరీరానికి అందుతుంది. హై బీపీ తో బాధపడే వారికి ఇవి బాగా తోడ్పడతాయి. ఆరోగ్యం ఫిట్ గా ఉండటానికే కాకుండా హై బీపీని తగ్గించుకోవటానికి వ్యాయామాలు, నడక, జాగింగ్ వంటివి వాటిని రోజువారి అలవాటుగా మార్చుకోవటం మంచిది. తద్వారా అధిక బీపీ సమస్య నుండి బయటపడవచ్చు.