రామజన్మభూమిలోకి రామ్ లల్లా విగ్రహం తరలింపు

ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశమంతా లాక్ డౌన్ ప్రకటించి ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకుండా కేంద్రం ఆంక్షలు విధిస్తే.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ మాత్రం బుధవారం తెల్లవారు ఝామున లాక్ డౌన్ ని ఉల్లంఘించారు. అయోధ్యలోని రామ్ లాల్లా విగ్రహాన్ని రామజన్మభూమి ప్రాంగణానికి తరలించారు.
అయోధ్యలో జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం యోగి ఆదిత్యనాధ్ పాల్గోన్నారు. కొద్ది మంది అధికారులు పార్టీ అనుచరులతో ఆయన అయోధ్యకు తరలివెళ్లారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థలం ఇన్నాళ్లూ న్యాయస్థానాల్లో నలిగిన నేపథ్యంలో.. సంబంధిత వివాద ప్రదేశంలో రామ్‌లల్లా విగ్రహాలను ఉంచలేదు.రామజన్మభూమి స్థలానికి కొద్ది దూరంలో ఉన్న ఓ చిన్న షెడ్డులో శ్రీరాముడు, సీతమ్మ అమ్మవారి విగ్రహాలను ఉంచి.. పూజలు కొనసాగిస్తూ వచ్చారు.
తాజాగా- వివాదస్పద భూమి రామ్‌లల్లా విరాజ్‌మాన్‌కే దక్కిన నేపథ్యంలో.. ఇక శ్రీరామచంద్రుడి జన్మస్థలానికి స్వామివారి విగ్రహాలను తరలించే కార్యక్రమానికి ఉగాది నాడు శ్రీకారం చుట్టారు. నవరాత్రి మొదటిరోజు సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ రామాలయం నిర్మాణం కోసం రూ.11లక్షల చెక్ ను ప్రదానం చేశారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమిపూజ చేసే తేదీని ఏప్రిల్ 2వతేదీ రామనవమి సందర్భంగా ప్రకటిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు గతంలో ప్రకటించింది.
బుధవారం ఇంజినీరింగ్ నిపుణులతో కూడిన కమిటీ రామాలయం నిర్మాణంపై సాంకేతిక నివేదికను సమర్పించనుంది. స్ధానికులు ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా అధికారులు భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ ఎస్, విశ్వహిందూ పరిషత్ కు చెందిన పలువురు సీనియర్ నాయకులు పాల్గోన్నారు.
अयोध्या करती है आह्वान…
भव्य राम मंदिर के निर्माण का पहला चरण आज सम्पन्न हुआ, मर्यादा पुरुषोत्तम प्रभु श्री राम त्रिपाल से नए आसन पर विराजमान…
मानस भवन के पास एक अस्थायी ढांचे में ‘रामलला’ की मूर्ति को स्थानांतरित किया।
भव्य मंदिर के निर्माण हेतु ₹11 लाख का चेक भेंट किया। pic.twitter.com/PWiAX8BQRR
— Yogi Adityanath (@myogiadityanath) March 25, 2020
Also Read | ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు