ఎన్నికల తర్వాత మోడీ జైలుకు: రాహుల్ గాంధీ
సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ జైలుకు వెళ్లడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అన్నారు.

సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ జైలుకు వెళ్లడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అన్నారు.
సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ జైలుకు వెళ్లడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. రాఫెల్ ఢీల్‌లో అవిపనీతికి పాల్పడిన చౌకీదార్ నరేంద్ర మోడీ, జైలుకు వెళ్తారని రాహుల్ అన్నారు. రాఫెల్ ఢీల్‌లో జరిగిన అవినీతి అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌కు తెలుసునని రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రభుత్వం రాగానే మోడీ జైలుపాలు అవుతారని అన్నారు.
Read Also : లక్ష్మీ పార్వతిపై లైంగిక వేధింపుల కేసు నమోదు
రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన డాక్యుమెంట్‌ను చౌకీదార్ నరేంద్ర మోడీ మార్చారని, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై దర్యాప్తు జరిపించి, ‘చౌకీదారు’ను జైలుకు పంపిస్తానని రాహుల్ గాంధీ చెప్పారు. ఒక్కో రాఫెల్ విమానం ధరను ప్రధాని నరేంద్ర మోడీ రూ.1600 కోట్లకు పెంచినట్లు పత్రాలు తెలియజేస్తున్నాయని, చౌకీదారును జైలుకు పంపించటం ఖాయమని అన్నారు.
ఇదే సమయంలో అనీల్ అంబానీ పైన కూడా రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. నష్టాల్లో పూర్తిగా కూరుకుపోయి, అసలు వ్యాపారమే సరిగ్గా లేని అనీల్ అంబానీకి ఇంత పెద్ద రక్షణ కాంట్రాక్ట్‌ను ఎందుకు ఇచ్చారని రాహుల్ ప్రశ్నించారు. ఎప్పుడూ అబద్దాలు చెప్పే ప్రధాని మనకు వద్దని, నేను అబద్దాలు చెప్పనని రాహుల్ అన్నారు.
Read Also : విప్రోలో పాకిస్తాన్ షేర్లు అమ్మిన కేంద్రం