సూపర్ ఐడియా : రీ సైకిల్ ప్లాస్టిక్‌తో చలికోట్లు, బూట్లు

దక్షిణ భారతంలో టాప్ టూరిస్ట్ ప్లేస్ అయిన ఊటీలో ప్రభుత్వం కొత్త ప్రయోగం చేసింది. ప్లాస్టిక్ వేస్టేజ్‌తో పరిసరాలు పాడవకుండా ఉండాలని వినూత్న ప్రయోగానికి తెరలేపింది. రోడ్లపై ఉన్న వేస్ట్ ప్లాస్టిక్ మెటేరియల్‌ను రీ సైకిల్ చేసేందుకు వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేసింది. వారం రోజులుగా జరుగుతున్న ఈ ప్రక్రియ పూర్తి విజయవంతమైందని అధికారులు తెలిపారు.
‘ప్రతి ప్లాస్టిక్ బాటిల్ సేకరించి దాన్ని రీసైకిల్ చేయడమే మా పని. అది వాటర్ బాటిల్, జ్యూస్, ఆయిల్, పర్సనల్ కేర్, గృహోపకరణానికి ఉపయోగించే ప్లాస్టిక్ ఏదైనా సరే రీ సైకిల్ మిషన్లో వేయొచ్చు. దీని ద్వారా ప్లాస్టిక్ వేస్టేజ్‌ను తగ్గించడమే కాక, కొత్తవారికి ఉపాధి కూడా కల్పించవచ్చు. ఈ ప్లాస్టిక్ సేకరించి ఇచ్చిన వారికి పేటీఎమ్ కూపన్లు కూడా ఇస్తారు. ఈ మెషీన్లో 1500ప్లాస్టిక్ బాటిల్స్ వరకూ స్టోర్ చేయొచ్చు. ఇలా రీసైకిల్ చేసిన తర్వాత వీటిని గుజరాత్, మహారాష్ట్రకు తరలిస్తారు’ అని నీల్‌గిరీస్ జిల్లా కలెక్టర్ దివ్యా వివరించారు.
ఈ రీ సైకిల్ ప్లాస్టిక్‌తో టీ షర్టులు, అథ్లెటిక్ షూలు, లగేజ్, స్వెట్టర్లు, ఫైబర్ ఫిల్, చలికోట్లు, షీట్లు, ఫిల్మ్‌లు, ఆటోమోటివ్ వస్తువులు, లగేజి ర్యాక్‌లు, హెడ్ లైనర్స్, ఫ్యూజ్ బాక్సులు, బంపర్లు, గ్రిల్స్, డోర్ ప్యానెల్స్ వంటి వస్తువులు తయారుచేయవచ్చు.
వెండింగ్ మెషీన్ తయారుచేసిన కంపెనీ సీఈవో అజయ్ మిశ్రా మాట్లాడుతూ.. రీ సైకిల్ ప్లాస్టిక్ సాయంతో పరిసరాలను కాపడటమే కాక, ప్రతి ఒక్కరూ ఒక్కో కిలోకు 25-35రూ సంపాదించుకోవచ్చు. ఈ రీసైకిల్ పద్ధతిలో ముందున్న అమెరికా, జపాన్, యూరప్, చైనాల కంటే 80శాతం భారత్ ఇంకా వెనుకబడే ఉందని ఓ సర్వేలో తేలింది.