Meghalaya CM Office : మేఘాలయ సీఎం ఆఫీస్ పై రాళ్ల దాడి.. ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయాలు

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం వెలుపల వందలాంది మంది జనం గుమిగూడారు. ఆ సమయంలో కొందరు సీఎం కార్యాలయంపై రాళ్లు రువ్వడంతో ఘర్షణ మొదలైనట్లు తెలుస్తోంది.

Meghalaya CM Office : మేఘాలయ సీఎం ఆఫీస్ పై రాళ్ల దాడి.. ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయాలు

Meghalaya CM office

Updated On : July 25, 2023 / 10:00 AM IST

Agitators Pelted Stones : మేఘాలయ సీఎం కన్నాడ్ సంగ్రా కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తురాలో శీతాకాల రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు ఆందోళనకారులు సీఎం కార్యాలయాన్ని ముట్టడించారు. సీఎం కార్యాలయంపై రాళ్ల దాడి చేశారు. నిరసన కారుల దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయాలు అయ్యాయి.

సీఎం మాత్రం క్షేమంగానే ఉన్నారు. వందలాది మంది ఆందోళనకారులు రోడ్డును బ్లాక్ చేయడంతో సీఎంతోపాటు ఓ మంత్రి ఆఫీస్ లోనే ఉన్నారు. తురాలో శీతాకాల రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గారో హిల్స్ కు చెందిన పౌర సమాజ సంఘాలు నిరాహార దీక్ష చేపట్టాయి.

Freedom Fighter Wife: మణిపూర్ లో మరో దారుణం.. స్వాతంత్య్ర సమరయోధుడి భార్యను ఇంట్లో బంధించి సజీవ దహనం

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం వెలుపల వందలాంది మంది జనం గుమిగూడారు. ఆ సమయంలో కొందరు సీఎం కార్యాలయంపై రాళ్లు రువ్వడంతో ఘర్షణ మొదలైనట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది గాయాలు కావడంతో వారిని సీఎం కార్యాలయంలోకి తీసుకెళ్లారు.

ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 8 లేదా 9 తేదీల్లో షిల్లాంగ్ లో చర్చలకు రావాలని పౌర సంఘాల ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు.