Agra : బోరుబావిలో పడిన చిన్నారి..కొనసాగుతున్న సహాయక చర్యలు
మూడు సంవత్సరాలున్న చిన్నారి 150 అడుగుల లోతులో ఉన్న బోరుబావిలో పడిపోయిన ఘటన కలకలం రేపింది. ఆగ్రాలోని Dhariyai villageలో 2021, జూన్ 14వ తేదీ సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న తాము..అక్కడ సహాయక చర్యలు చేపట్టడం జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.

Agra
Agra Deep Borewell : బోరు తవ్విన తర్వాత..ఆ బావిని మూసివేయాలని నెత్తినోరు మెత్తుకుని చెబుతున్నా..కొంతమంది పెడచెవిన పెడుతున్నారు. దీంతో ఆటలాడుకుంటూ..చిన్నారులు అందులో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అధికారులు చేపట్టే సహాయక చర్యల్లో కొంతమంది ప్రాణాలతో బయటపడుతుండగా..మరికొందరి చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఆగ్రాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. మూడు సంవత్సరాలున్న చిన్నారి 150 అడుగుల లోతులో ఉన్న బోరుబావిలో పడిపోయిన ఘటన కలకలం రేపింది. ఆగ్రాలోని Dhariyai villageలో 2021, జూన్ 14వ తేదీ సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న తాము..అక్కడ సహాయక చర్యలు చేపట్టడం జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.
ఆగ్రా రూరల్ ప్రాంతంలోని ఫతేబాద్ Nibohara పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం 8.30గంటలకు మూడేళ్ల చిన్నారి ఆటలాడుకొంటోంది. ఆడుకుంటూ..ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చిన్నారి కదలికలు కనిపిస్తున్నాయని స్టేషన్ హౌస్ ఆఫీసర్ సూరజ్ ప్రసాద్ వెల్లడించారు. చిన్నారి బోరుబావిలో పడి పోయిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్నారి క్షేమంగా బయటకు రావాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.
Read Morer : SreeLeela : దర్శకేంద్రుడు వదులుతున్న మరో అందాల బాణం.. శ్రీలీల..