AIADMK: ఓపీఎస్ నమ్మకద్రోహి, ఊసరవెళ్లి.. ఈపీఎస్ విమర్శలు

పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున చేరుకున్న నేతలు, కార్యకర్తలు పళనిస్వామికి ఘన స్వాగతం పలికారు. కాగా, తొందరలో పార్టీ జనరల్ సెక్రెటరీ పదవికి ఎన్నికలు జరుగుతాయని ఆయన ప్రకటించారు. ఇక పన్నీర్ సెల్వం ఊసరవెళ్లి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టగానే ఎంజీఆర్, జయలలితలకు ఈపీఎస్ నివాళులు అర్పించారు

AIADMK: ఓపీఎస్ నమ్మకద్రోహి, ఊసరవెళ్లి.. ఈపీఎస్ విమర్శలు

AIADMK interim Gen Secy EPS slams rival calls OPS is chameleon

Updated On : September 8, 2022 / 7:55 PM IST

AIADMK: తన సహచర మాజీ ఉపముఖ్యమంత్రి మాత్రమే కాకుండా పార్టీ నేత అయిన ఓ.పన్నీర్ సెల్వంపై మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే జనరల్ సెక్రెటరీ ఈ.పళని స్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పన్నీర్ సెల్వం పార్టీకి ద్రోహం చేశారని ఆయన గురువారం అన్నారు. అన్నాడీఎంకే పార్టీకి తాత్కాలిక జనరల్ సెక్రెటరీగా పళనిస్వామి ఎన్నికైన రెండు నెలలు అయింది. ఆ ఎన్నిక జరిగిన అనంతరం గురువారమే తొలిసారి పార్టీ కార్యాలయానికి వచ్చారు.

పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున చేరుకున్న నేతలు, కార్యకర్తలు పళనిస్వామికి ఘన స్వాగతం పలికారు. కాగా, తొందరలో పార్టీ జనరల్ సెక్రెటరీ పదవికి ఎన్నికలు జరుగుతాయని ఆయన ప్రకటించారు. ఇక పన్నీర్ సెల్వం ఊసరవెళ్లి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టగానే ఎంజీఆర్, జయలలితలకు ఈపీఎస్ నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ‘‘ఓపీఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. మళ్లీ అతడిని పార్టీ ఎలా ఆహ్వానిస్తుంది? అతడు పార్టీకి నమ్మకద్రోహం చేశాడు. అతడు ఊరసవెళ్లి’’ అని విమర్శలు గుప్పించారు.

‘‘నేను పార్టీకి నమ్మకంగా పని చేశాను. జయలలిత మద్దతుదారుడిగానే ఇప్పటికీ కొనసాగుతున్నాను. నిజమైన పార్టీ కార్యకర్తలంతా ఇప్పుడు నాతోనే ఉన్నారు. ద్రోహులు, విధ్వేషకారులు పార్టీ నుంచి వెళ్లిపోయారు’’ అని ఈపీఎస్ అన్నారు. జూలైలో పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించారు. సెల్వంతో పాటు ఆయన మద్దతుదారులు సైతం ఏఐడీఎంకే నుంచి వెళ్లిపోయారు. దీంతో ఈపీఎస్-ఓపీఎస్ కూటమిగా ఉన్న పార్టీ.. ఏక వ్యక్తి నాయకత్వానికి మారింది.

EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రానికి వ్యతిరేకమా?.. సుప్రీం కీలక నిర్ణయం