EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రానికి వ్యతిరేకమా?.. సుప్రీం కీలక నిర్ణయం

మూడు అంశాలను పరిగణలోకి తీసుకుని పరిశీలించాలని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది. అంతే కాకుండా ఈ విషయమై దాఖలైన పిటిషన్లపై సెప్టెంబర్ 13 నుంచి విచారణ ప్రారంభమవుతుందని సుప్రీం ప్రకటించింది. ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో అగ్ర కులాల వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 2019 జనవరిలో పార్లమెంటు ఆమోదించిన సంగతి తెలిసిందే. దీనిపై దాఖలైన పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది

EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రానికి వ్యతిరేకమా?.. సుప్రీం కీలక నిర్ణయం

Next Chief Justice of India

EWS Quota: ప్రస్తుతం రిజర్వేషన్ ఉన్న వర్గాలకు కాకుండా ఇతర వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వారికి లబ్ది చేకూరే విధంగా నిర్దేశించిన ‘ఎకనామిక్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్’ (ఈడబ్ల్యూఎస్) భారత రాజ్యాంగ మౌలిక సూత్రానికి వ్యతిరేకమనే వాదన చాలా రోజులుగా నడుస్తోంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చిన నాటి నుంచి దేశంలోని నలుమూలల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే ఇది నిజంగానే రాజ్యాంగ మౌలిక సూత్రానికి వ్యతిరేకమా, లేదా? అనే విషయాన్ని నిర్ధారించేందుకు మూడు అంశాలను పరిశీలించాని సుప్రీంకోర్టు తాజాగా నిర్ణయించింది. అంతే కాకుండా ఈ మూడు అంశాలపై సుప్రీం నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపే మూడు అంశాలు :
1. ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్ల కల్పనతో పాటు ఇతర ప్రత్యేక నిబంధనలను రూపొందించి, అమలు చేసేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇవ్వడం భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించడమేనా?
2. ప్రైవేటు అన్ఎయిడెడ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలను రూపొందించి, అమలు చేసేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇవ్వడం రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించడమేనా?
3. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కోటా పరిధి నుంచి ఈబీసీలు, ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలను మినహాయించడం రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి తూట్లు పొడవడమేనా?

పై మూడు అంశాలను పరిగణలోకి తీసుకుని పరిశీలించాలని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది. అంతే కాకుండా ఈ విషయమై దాఖలైన పిటిషన్లపై సెప్టెంబర్ 13 నుంచి విచారణ ప్రారంభమవుతుందని సుప్రీం ప్రకటించింది. ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో అగ్ర కులాల వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 2019 జనవరిలో పార్లమెంటు ఆమోదించిన సంగతి తెలిసిందే. దీనిపై దాఖలైన పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ పిటిషన్లపై విచారణ జరుపుతున్న రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ యూయూలలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ ఎస్‌బీ పర్దీవాలా, జస్టిస్ బెలా త్రివేది ఉన్నారు.

Governor Tamilisai : గౌరవం లేదు, కనీసం పలకరింపూ లేదు.. కేసీఆర్ ప్రభుత్వంపై మరోసారి గవర్నర్ తమిళిసై షాకింగ్ కామెంట్స్