Air India Flight : జైపూర్ లో ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్.. తిరిగి టేకాఫ్ చేసేందుకు నిరాకరించిన పైలట్

దాదాపు 2 గంటల అనంతరం విమానం తిరిగి ఢిల్లీ వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చింది. కానీ, విమానాన్ని తిరిగి టేకాఫ్ చేసేందుకు పైలట్ నిరాకరించారు. డ్యూటీ అయిపోయిందని తాను విమానాన్ని నడపబోనని స్పష్టం చేశాడు.

Air India Flight : జైపూర్ లో ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్.. తిరిగి టేకాఫ్ చేసేందుకు నిరాకరించిన పైలట్

Air India flight

Air India Flight Emergency Landing : ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో విదాదంలో చిక్కింది. లండన్ నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో జైపూర్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. తిరిగి విమానాన్ని టేకాఫ్ చేసేందుకు పైలట్ నిరాకరించడంతో అందులోని 350 మంది ప్రయాణికులు విమానంలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు.

లండన్ నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం షెడ్యూల్ ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ కావాల్సివుంది. కానీ, ఢిల్లీ ఎయిర్ పోర్టు దగ్గర వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ విమానం పది నిమిషాలు గాలిలో చక్కర్లు కొట్టింది. అనంతరం రాజస్థాన్ లోని జైపూర్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది.

Manik Rao Thackeray : బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే.. విపక్షాల సమావేశానికి ఎందుకు హాజరుకాలేదు : మాణిక్ రావు థాక్రే

ఈ నేపథ్యంలో దాదాపు 2 గంటల అనంతరం విమానం తిరిగి ఢిల్లీ వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చింది. కానీ, విమానాన్ని తిరిగి టేకాఫ్ చేసేందుకు పైలట్ నిరాకరించారు.
డ్యూటీ అయిపోయిందని తాను విమానాన్ని నడపబోనని స్పష్టం చేశాడు. దీంతో విమానంలోని 350 మంది ప్రయాణికులు జైపూర్ ఎయిర్ పోర్టులోనే చిక్కుకుపోయారు.

ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా, కొంతమంది ప్రయాణికులు ఇతర మార్గాల్లో ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం కొన్ని గంటల తర్వాత ఇతర సిబ్బంది సాయంతో ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి చేరుకుంది.