Air India: కొత్త లుక్‌లో ఎయిర్ ఇండియా విమానాలు.. మహారాజా మస్కట్ ఇక ఉండదా? దాని చరిత్రేంటి?

దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఒక్క ఏడాది ముందు (1946లో) ఈ మహారాజా మస్కట్‌ను రూపొందించారు.

Air India: కొత్త లుక్‌లో ఎయిర్ ఇండియా విమానాలు.. మహారాజా మస్కట్ ఇక ఉండదా? దాని చరిత్రేంటి?

Air India – Maharaja Mascot

Air India – Maharaja Mascot: ఎయిర్ ఇండియా కంపెనీ లోగో, లివరీని మార్చుకుని కొత్త లుక్‌తో ముందుకు రానుంది. ఎయిర్ ఇండియాను సొంతం చేసుకున్నప్పటి నుంచి టాటా గ్రూప్ (Tata Group) అనేక మార్పులు చేస్తోన్న విషయం తెలిసిందే. గురువారం కొత్త లోగోను ఆ సంస్థ అధికారులు ఆవిష్కరించారు. ఈ కొత్త లోగో ది విస్టా (The Vista), గోల్డ్ విండో ఫ్రేమ్ ప్రయాణికులను ఆకట్టుకునేలా ఉంది.

” ఆకాశమంత ఎత్తుకు ఎదిగేలా, విజయానికి దారులు ” అనే సందేశాన్ని ఇచ్చేలా దీన్ని గోల్డ్ విండో ఫ్రేమ్ ను రూపొందించారు. ఓ బాలిక గోల్డ్ విండో ఫ్రేమ్ లో కిటికీలో నుంచి చూస్తున్నట్లు, ఆ తర్వాత ప్రపంచం మొత్తాన్ని దాని నుంచే చూస్తున్నట్లు ఓ వీడియోను కూడా రూపొందించింది టాటా గ్రూప్. ఈ ఏడాది డిసెంబరు నుంచి తమ విమానాలపై ఈ కొత్త లోగోనే ఉంటుందని టాటా గ్రూప్ తెలిపింది. ఎర్రని అక్షరాలతో ఎయిర్ ఇండియా పేరును రాశారు.

మహారాజా మస్కట్ చరిత్ర
కొత్త లుక్ తీసుకువస్తున్న నేపథ్యంలో మహారాజా మస్కట్ ను ఉంచుతున్నారా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కంపెనీ స్పష్టత ఇచ్చింది. మహారాజా మస్కట్ ను తీసేయడం లేదని స్పష్టం చేసింది.

దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఒక్క ఏడాది ముందు (1946లో) ఈ మహారాజా మస్కట్ ను అప్పటి ఎయిర్ ఇండియా డైరెక్టర్ బాబీ కూకా, వాల్టర్ థామ్స్‌పన్ లిమిటెడ్ కు చెందిన ఆర్టిస్ట్ ఉమేశ్ రావు రూపొందించారు. ఆ ఏడాది నుంచే ఎయిర్ ఇండియా మహారాజా మస్కట్ ను వాడుతోంది. 2015లో మహారాజా మస్కట్ ను మేక్ ఓవర్ చేసి అధునికంగా తీర్చిదిద్దారు.

దీనికే ఇప్పుడు స్వల్ప మార్పులు చేయనున్నారు. అయితే, విమానయాన సంస్థలో ప్రీమియం లాంజ్‌లు, క్రాకరీ వంటి అంశాలకు మాత్రమే వాడతామని అధికారులు తెలిపారు. 1946 నుంచి ఎయిర్ ఇండియా గుర్తింపు విషయంలో అంతర్గతంగా ఈ మహారాజా ఉంటున్నాడు. ఈ మహారాజా మస్కట్ ను త్వరలోనే తొలగిస్తారని ఇటీవల అనేక కథనాలు వచ్చాయి.

Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో రైల్ బంపర్ ఆఫర్.. ఇలా రూ.59కే సిటీ అంతా తిరిగేయండి..