Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ బంపర్ ఆఫర్.. ఇలా రూ.59కే సిటీ అంతా తిరిగేయండి..

సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డును ఇప్పుడు కేవలం రూ.59తోనే రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ బంపర్ ఆఫర్.. ఇలా రూ.59కే సిటీ అంతా తిరిగేయండి..

Hyderabad-Metro-Rail

Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో రైల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆగస్టు 15న దేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవం (Independence day 2023) జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెట్రో రైలు అధికారులు సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్ (Super Saver Freedom Offer) ను ప్రకటించారు.

ఈ ప్రత్యేక ఆఫర్ ను మూడు రోజులు వినియోగించుకోవచ్చు. ఇప్పటికే మెట్రో స్టేషన్లలో సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డులు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. సెలవు రోజుల్లో రూ.99తో రీఛార్జ్ చేయించుకుంటే ఆ రోజంతా హైదరాబాద్ మెట్రో రైళ్లలో ఎన్ని సార్లైనా ప్రయాణం చేయవచ్చు.

అదే సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డును వాడుకుంటూ ఇప్పుడు కేవలం రూ.59తోనే రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ ఆఫర్ కేవలం ఆగస్టు 12, 13, 15 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీన్ని వాడుకుని అపరిమిత మెట్రో రైడ్‌లను ఆస్వాదించవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా, మెట్రో రైల్ ఇప్పటికే విద్యార్థులకు కూడా స్టూడెంట్ పాస్ ఆఫర్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక, మెట్రో రైల్ కోచ్ లనూ పెంచే అవకాశం ఉంది. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని మెట్రో రైల్ అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

Hyderabad Metro: గుడ్ న్యూస్.. హైదరాబాద్ మెట్రో రైల్ కోచ్‌లు పెరిగే అవకాశం.. అంతేకాదు..