Air India Plane: బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన ఎయిరిండియా

ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ బయట ఎయిరిండియా ఎయిర్‌క్రాఫ్ట్ ఓ బ్రిడ్జ్ కింద ఇరుక్కుపోయింది. గురుగ్రామ్-ఢిల్లీ హైవే మీద భారీ వాహనంలో ట్రాన్స్‌పోర్ట్ జరుగుతుండగా ఘటన జరిగింది.

Air India Plane: బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన ఎయిరిండియా

Air India

Updated On : October 4, 2021 / 6:44 AM IST

Air India Plane: ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ బయట ఎయిరిండియా ఎయిర్‌క్రాఫ్ట్ ఓ బ్రిడ్జ్ కింద ఇరుక్కుపోయింది. గురుగ్రామ్-ఢిల్లీ హైవే మీద భారీ వాహనంలో ట్రాన్స్‌పోర్ట్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. అధికారులు అలర్ట్ అయ్యేలోపే ఈ సన్నివేశాన్ని ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాల్లో పోస్టు చేశారు. కాకపోతే ఇది కొత్త విమానం కాదని పాతదానిని ట్రాన్స్ పోర్ట్ చేస్తుండగా ఇలా జరిగిందని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

ఇదంతా అధికారులు, ట్రాన్స్‌పోర్టర్ నిర్లక్ష్యమేనని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. మరి కొందరు ఆ వెహికల్ టైర్లు తీసేసి ముందుకు జరిపితే కాస్త గ్యాప్ వస్తుందని అప్పుడు బయటకు తీయొచ్చంటూ హింట్స్ ఇస్తున్నారు.

…………………………………………………. : సెక్యూరిటీ అప్‌డేట్ అని మేసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త.. క్లిక్ చేస్తే ఖతమే

ఇటీవలి కాలంలో వినూత్నమైన ఆలోచనలతో ముందుకొస్తున్నారు యువ వ్యాపారవేత్తలు. పాత రైళ్లు, విమానాలను సంబంధిత శాఖల నుంచి కొనుగోలు చేసి అందులో రెస్టారెంట్లను, టూరిస్ట్ హబ్ లుగా మారుస్తున్నారు. ఈ విమానం కూడా అటువంటి ప్రయోగానికా.. లేదంటే మరే ప్రయోజనం కోసమో తీసుకెళ్తున్నారా అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.