Viral Video : వంతెన కింద ఇరుక్కుపోయిన ఎయిర్ ఇండియా విమానం

ఎయిర్ ఇండియాకు చెందిన రెక్కలు లేని విమానం ఒకటి వంతెన కింద ఇరుక్కుపోయింది. ఢిల్లీ గుర్గావ్ హైవేపై ఈ ఘటన జరిగింది.

Viral Video : వంతెన కింద ఇరుక్కుపోయిన ఎయిర్ ఇండియా విమానం

Viral Video

Updated On : October 3, 2021 / 8:58 PM IST

Viral Video : ఎయిర్ ఇండియాకు చెందిన రెక్కలు లేని విమానం ఒకటి వంతెన కింద ఇరుక్కుపోయింది. ఢిల్లీ గుర్గావ్ హైవేపై ఈ ఘటన జరిగింది. రోడ్డుకు ఒక పక్కగా వాహనాలు వెళ్తుండగా మరోవైపు వంతెన కింద ఇరుక్కున్న విమానం కనిపించింది. ప్రస్తుతం ఈ విమానం ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ వీడియో ఎయిర్ ఇండియా అధికారుల దృష్టికి వెళ్లడంతో దీనిపై స్పందించారు.

Read More : Ram Mohan Naidu: యువతను నిలబెట్టి గెలుస్తాం.. అధికారంలోకి వస్తాం -రామ్మోహన్ నాయుడు

తాము అమ్మేసిన పాత విమానం కొన్న వ్యక్తి తరలిస్తుండగా వంతెన కింద స్ట్రక్‌ అయినట్లు చెప్పారు. ఈ ఘటనతో ఎయిర్‌ ఇండియాకు ఎలాంటి సంబంధం లేదని వివరించింది. మరోవైపు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. స్థానిక అధికారులు శ్రమించి విమానాన్ని వంతెన కింద నుంచి బయటకు తెచ్చారు.

Read More : ZyCov-D Vaccine : మూడు డోసుల పిల్లల కోవిడ్ వ్యాక్సిన్ ధర రూ.1900!