Air India: ఎయిరిండియా రిటైర్డ్ ఉద్యోగులు మళ్లీ కొలువుల్లోకి..

టాటా గ్రూప్ సొంతం చేసుకున్న ఎయిరిండియా రిటైర్ అయిన ఉద్యోగులను తిరిగి కొలువుల్లోకి తీసుకోనున్నారు. సింగిల్ పైలట్ నడపగలిగే 300విమానాలను కొనుగోలు చేసే చర్చల మధ్య కార్యకలాపాలలో స్థిరత్వం కోసం చూస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆఫర్ చేశారు.

Air India: ఎయిరిండియా రిటైర్డ్ ఉద్యోగులు మళ్లీ కొలువుల్లోకి..

Air India

Updated On : June 24, 2022 / 12:21 PM IST

Air India: టాటా గ్రూప్ సొంతం చేసుకున్న ఎయిరిండియా రిటైర్ అయిన ఉద్యోగులను తిరిగి కొలువుల్లోకి తీసుకోనున్నారు. సింగిల్ పైలట్ నడపగలిగే 300విమానాలను కొనుగోలు చేసే చర్చల మధ్య కార్యకలాపాలలో స్థిరత్వం కోసం చూస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆఫర్ చేశారు.

ఈ పైలట్‌లను మళ్లీ కమాండర్‌లుగా నియమించుకోవాలని ఎయిరిండియా పరిశీలిస్తోందని తెలిపింది. క్యాబిన్ క్రూ, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు వంటి ఇతర కీలక పాత్రలతో పోలిస్తే పైలట్‌లు ఎయిర్‌లైన్‌కు అత్యంత ఖరీదైన ఆస్తిగా పోల్చారు.

అంతేకాకుండా, దేశీయ విమానయాన పరిశ్రమలో తగినంత శిక్షణ పొందిన పైలట్ల కొరత ఎల్లప్పుడూ సమస్యగా ఉంది. ఎయిరిండియాలో కమాండర్‌గా పదవీ విరమణ తర్వాత కాంట్రాక్టు కోసం మిమ్మల్ని 5 సంవత్సరాల పాటు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు, ఏది ముందైతే అది పరిగణనలోకి తీసుకుంటామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం” అని ఎయిరిండియా పర్సనల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వికాస్ గుప్తా తెలిపారు.

Read Also: రెండు వారాలకే ఎయిరిండియా సీఈఓ జాబ్ వదిలేసిన ఇల్కర్ ఐసీ

”విరమణ తర్వాత కాంట్రాక్ట్ సమయంలో, అటువంటి నియామకాలకు ఎయిరిండియా పాలసీ ప్రకారం.. ఆమోదయోగ్యమైన విధంగా వేతనం, ఫ్లయింగ్ అలవెన్సులు చెల్లిస్తాం” అని పేర్కొన్నారు.

ఆసక్తి ఉన్న పైలట్‌లు తమ వివరాలను లిఖిత పూర్వక అప్రూవల్‌తో పాటు జూన్ 23లోగా మెయిల్‌లో సమర్పించాలని చెప్పబడింది.

ఎయిర్ ఇండియాలో పైలట్ల పదవీ విరమణ వయస్సు ఎయిర్‌లైన్‌లోని ఇతర ఉద్యోగులందరిలాగే 58 సంవత్సరాలు. మహమ్మారికి ముందు, ఎయిరిండియా తన రిటైర్డ్ పైలట్‌లను కాంట్రాక్ట్‌పై తిరిగి నియమించుకునేది. మార్చి 2020 తర్వాత ఈ పద్ధతిని ఆపేశారు.