AirAsia-IndiGo: గాల్లో ఎదురెదురుగా రెండు విమానాలు.. జస్ట్ మిస్ అంతే!

రోడ్డు మార్గంలో రెండు వాహనాలు క్రాసింగ్ ఎలా అవుతాయో మనం రోజు చూస్తూనే ఉంటాం. అయితే గగన మార్గంలో విమానాలు ఎలా క్రాస్ అవుతాయో ఆ ఫైలెట్లు తప్ప మరెవరూ చూడలేరు.

AirAsia-IndiGo: గాల్లో ఎదురెదురుగా రెండు విమానాలు.. జస్ట్ మిస్ అంతే!

Airasia, Indigo

Updated On : August 24, 2021 / 6:29 PM IST

AirAsia, IndiGo: రోడ్డు మార్గంలో రెండు వాహనాలు క్రాసింగ్ ఎలా అవుతాయో మనం రోజు చూస్తూనే ఉంటాం. అయితే గగన మార్గంలో విమానాలు ఎలా క్రాస్ అవుతాయో ఆ ఫైలెట్లు తప్ప మరెవరూ చూడలేరు. ఆ పైలెట్లు కూడా దూరం నుండి చూడడమే తప్ప దగ్గరగా చూడలేరు. గాల్లో విమానాల క్రాసింగ్ కోసం ఓ ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. అచ్చంగా రోడ్డు మార్గాల మాదిరే గాల్లో కూడా విమాన మార్గాలు ఉంటాయి. ట్రాఫిక్ కంట్రోలర్ నిరంతరం విమానాల ప్రయాణాన్ని గమనిస్తూ ఫైలెట్లకు సూచనలు చేస్తూ క్రాసింగ్ సిగ్నల్స్ ఇస్తారు. ట్రాఫిక్ కంట్రోలర్ ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా ఘోర ప్రమాదాలను చూడాల్సి వస్తుంది.

అలా అప్రమత్తంగా లేని ఓ ట్రాఫిక్ కంట్రోలర్ వలన రెండు విమానాలు గాల్లో అంత్యంత దగ్గరగా వచ్చాయి. అయితే, పైలట్ల అప్రమమత్తతో పెను ప్రమాదం తప్పింది. జనవరి 29న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఇటీవల నివేదికను విడుదల చేసింది. ఎయిర్ ఏషియాకు చెందిన అహ్మదాబాద్‌-చెన్నై విమానం, ఇండిగోకు చెందిన బెంగళూరు-వడోదర విమానం జనవరి 29న ముంబై గగనతలంలో ఎదురెదురుగా చాలా దగ్గరకు వచ్చాయి. ఇవి 8 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఇండిగో విమానం 38,000 అడుగుల ఎత్తులో, ఎయిర్ ఏషియా విమానం 38,008 అడుగుల ఎత్తులో ఎదురెదురుగా ఉన్నాయి.

ఆ రెండు విమానాల మధ్య ప్రయాణ దూరం 6.5 కిలోమీటర్లు ఉండగా ఎయిర్‌ ఏషియా విమానంలోని వ్యవస్థ పైలట్లను హెచ్చరించింది. దీంతో పైలెట్ ఆ విమానాన్ని 38,396 అడుగుల ఎత్తుకు చేరడంతో ప్రమాదం తప్పింది. సాధారణంగా అహ్మదాబాద్‌ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లే ఫ్లైట్స్ భావనగర్ మీదుగా వెళ్తాయి. అయితే ఆ రోజు ఎయిర్‌ ఏసియా విమానం ముంబై విమానాశ్రయంలో ల్యాండిగ్‌ మార్గంలో ప్రయాణించింది. అయితే రెండు విమానాల పొజిషన్‌ గురించి ఆటోమేటిక్‌ సిస్టమ్‌ హెచ్చరించినప్పటికీ కంట్రోలర్‌ నిర్లక్ష్యం వహించడంతో రెండు విమానాలు దగ్గరగా వచ్చాయి. చివరికి పైలెట్ అప్రమత్తతతో ఆ రెండు విమానాలు 300 మీటర్ల ఎత్తు, 500 మీటర్ల సమీపంలో క్రాస్ అయ్యాయి.